For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్ళీ పాత కథతోనే త్రివిక్రమ్: ఆ వెంకటేష్ సినిమానే ఈ "అఙ్ఞాతవాసి" ??

  |
  వెంకటేష్ సినిమానే ఈ "అఙ్ఞాతవాసా" ??

  పాత తెలుగునవలలనో, లేదంటే ఏదో ఒక వేరే భాషలో వచ్చిన సినిమానో కాపీకొట్టి మామూలు భాషలో అయితే స్పూర్థి గా తీసుకొని సినిమాలు చేయటం మన టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అయితే ఆ విషయాన్ని సదరు దర్శకుడు బహిరంగంగా ఒప్పుకోకుండా.. ఇంకెవరో చెప్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దర్శక ధీరుడు రాజమౌలి తీసిన"మర్యాద రామన్న" ఇంగ్లీష్ లోని అవర్ హాస్పిటాలిటీ అనే సినిమాకి దాదాపుగా రీమేక్ అని చెప్పుకోవచ్చు, ఇక కాక్రోచ్ అనే సినిమాకి ఈగ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా స్పూర్తి అనే అనాలి.

   విమర్శల పాలయ్యాడు

  విమర్శల పాలయ్యాడు

  ఇవన్నీ పక్కనపెడితే యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన "మీనా" అనే పాత నవలని 'అ ఆ' సినిమాగా మలిచిన త్రివిక్రమ్‌ ఆ విషయాన్ని గోప్యంగా వుంచి విమర్శల పాలయ్యాడు. నిజానికి విజయనిర్మల ఇదే కథ, "మీనా" అనే టైటిల్ తోనే ఎప్పుడో సినిమా తీసింది కూడా.

  విజయ నిర్మల

  విజయ నిర్మల

  అయితే ఒరిజినల్‌ రైటర్‌కి, దానిని మీనా అనే పేరుతో సినిమాగా తీసిన విజయ నిర్మలకి క్రెడిట్‌ ఇవ్వలేదని త్రివిక్రమ్‌ మీద విమర్శలు రాగానే నాలుక కరుచుకొని చివరకు "థాంక్స్ కార్డులు" వేయడం జరిగిందని..కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల కనిపించలేదని చెప్పి కవర్ చేసుకున్నాడు.

  వెంకటేష్‌ పాత సినిమానే స్ఫూర్తి

  వెంకటేష్‌ పాత సినిమానే స్ఫూర్తి

  పాత కథలని మరోసారి కొత్తగా రాయడం, తీయడం త్రివిక్రమ్‌కి కొత్తేమీ కాదు. నిజానికి వెంకటేష్ హీరోగా వచ్చిన "వారసుడొచ్చాడు" కథనే త్రివిక్రమ్ చేతిలో "అతడు" అయ్యింది. ఆ సినిమానే కొంచం మార్చి మహేష్ కి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తాజాగా 'అజ్ఞాతవాసి'కి కూడా ఒక వెంకటేష్‌ పాత సినిమా నుంచే స్ఫూర్తి పొందాడని అంటున్నారు.

  ఒంటరి పోరాటం

  ఒంటరి పోరాటం

  పక్కా క్లారిటీ అయితే లేదు గానీ ఇదే వార్త కాస్త బలంగానే టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చల్లో ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఒంటరి పోరాటం' చిత్రంలోని రివెంజ్‌ త్రెడ్‌ని తీసుకుని 'అజ్ఞాతవాసి'కి కథ అల్లాడట. మొత్తానికి దాదాపు మెయిన్ పాయింట్ తప్ప మిగతా కథంతా కొత్త్గా రాసుకున్నదే అంటున్నారు.

  కుష్బూ పగని పవన్‌ కళ్యాణ్‌ ద్వారా

  కుష్బూ పగని పవన్‌ కళ్యాణ్‌ ద్వారా

  అందులో జయసుధ తన పగని వెంకటేష్‌ ద్వారా తీర్చుకుంటే, ఇందులోను కుష్బూ తన పగని పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ద్వారా తీర్చుకుంటుందట. ఇక్కడ ఇంకో హైలెట్ ఏమిటంటే ఈ సినిమాకి కూడా ఒక నవల ఆధారం కావటం. త్రినాథ్ అనే పాత్ర ప్రధానంగా సాగే ఆ నవల ఒక పాపులర్ నవలా రచయితది.

   అజ్ఞాతంలో తిరిగే పాత్ర

  అజ్ఞాతంలో తిరిగే పాత్ర

  పగ తీర్చుకోవడం కోసం తన ఐడెంటిటీ దాచి పెట్టి అజ్ఞాతంలో తిరిగే పాత్రగా పవన్‌ కనిపిస్తాడట. అందుకే ఆ రహస్య జీవితానికి తగ్గట్టుగానే అజ్ఞాతవాసి టైటిల్ పెట్టినట్టున్నారు. కథ పాతదే అయినా త్రివిక్రమ్ మార్క్ పడ్డాక దాని రూపురేఖలే మారిపోతాయి.

  అతడి చుట్టూ కామెడీ

  అతడి చుట్టూ కామెడీ

  వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో రివెంజ్‌ ఎపిసోడ్స్‌ అన్నీ చాలా ఇంటెన్స్‌గా వుంటాయని, యాక్షన్‌ పార్ట్‌ చాలా బాగుంటుందని టాక్‌ వినిపిస్తోంది. పవన్‌ పాత్ర ఎక్కువ కామెడీ చేయదని, అతడులో మహేష్‌ మాదిరిగా కామ్‌గా వుంటాడని, అతడి చుట్టూ కామెడీ జరుగుతుంటుందని సమాచారం.

  English summary
  The Movie "Agnathavasi" Directing by Trivikram Srinivas inspired from Venkatesh's Ontari Poratam?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X