అక్కినేని అఖిల్ కాదు అల్లు అర్జున్?

అయితే అఖిల్ ఎంట్రీ కి సంబంధించి నాగార్జున - త్రివిక్రమ్‌ల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే అఖిల్ మాత్రం అలాంటిదేం లేదు... అంటున్నాడు. ఇప్పటి వరకూ తన సినిమాకి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదని... ఒకవేళ త్రివిక్రమ్‌తో అవకాశం వస్తే సంతోషిస్తానని చెబుతున్నాడు అఖిల్. ''త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నా అనే వార్తల్లో నిజం లేదు. దర్శకుడు ఎవరనేది తెలిస్తే నేనే చెబుతా'' అని ట్వీట్ చేశాడీ సిసింద్రీ. 'అత్తారింటికి దారేది' తరవాత త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుతం బన్ని ప్రస్తుతం 'రేస్ గుర్రం' సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 'రేసు గుర్రం' పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియచేసారు. జనవరి 14,2014న తమ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామని అన్నారు.
నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ..." మీరు అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూస్తారు. బన్ని కెరీర్ లో మొదటి సారి పూర్తి కామెడీ తో చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి మా సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తాం ," అన్నారు. శృతిహాసన్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి


Click it and Unblock the Notifications











