రాజమౌళికి త్రివిక్రమ్ చెక్.. అల్లు అర్జున్ తో భారీ ప్లాన్ నిజమేనా?

ఇండియన్ సినిమా గతిని మార్చేసిన వన్ అండ్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అది మన తెలుగు దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. అయితే తన కంటే ముందే చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేసి హిట్స్ కొట్టినవారు కూడా ఉన్నారు కానీ ఇపుడు ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్లో వేరే లెవెల్లో పెట్టిన దర్శకుడుగా మాత్రం రాజమౌళి మాత్రమే అని చెప్పవచ్చు.

అయితే ఇపుడు జక్కన్న గ్లోబల్ దర్శకుడు అయ్యిపోయారని అందరికీ తెలిసిందే. ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా జక్కన్న ఇలాంటి సినిమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ తన డ్రీం ప్రాజెక్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా మహాభారతం అనే చెబుతారు.

trivikram sensational planning with pushpa star Allu Arjun what SS rajamouli will do

అదే తన డ్రీం ప్రాజెక్ట్ అలాగే ఏకంగా 10 పార్టులుగా ప్లాన్ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య కాలంలో కూడా తన డ్రీం ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. అయితే ఇదిలా ఉండగా జక్కన్న డ్రీం ప్రాజెక్ట్ కి మన తెలుగు నుంచి ఉన్న మరో దర్శకుడు చెక్ చెబుతాడా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాలో పురాణాలూ, ఇతిహాసాలు అంటే ఒక్క రాజమౌళికి మాత్రమే కాకుండా మరో టాప్ దర్శకునికి కూడా మంచి పట్టు ఉంది.

కాగా ఆ దర్శకుడే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. తనతో ఉన్న టాప్ దర్శకులు అంతా ఆల్ మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో సెటిల్ అయ్యిపోయారు. ఇంకా త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే తన ఎంట్రీ ఊహించని లెవెల్లో కన్ఫర్మ్ కూడా అయ్యింది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న సినిమాతో అని తెలిసిందే.

trivikram sensational planning with pushpa star Allu Arjun what SS rajamouli will do

అల్లు అర్జున్ కెరీర్లో 22వ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం ఓ రూమర్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ ప్రాజెక్ట్ ని కూడా మహాభారతం కి దగ్గరగానే త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాల్లో సాహిత్యం, తన సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ కూడా బాగానే ఉంటాయి.

అలాంటిది తన నుంచి ఒక ఫాంటసీ వండర్ వస్తే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇది నిజంగా మహాభారతం ఐతే మాత్రం జక్కన్నకి దెబ్బే అని చెప్పవచ్చు. తెలుగులో ఆల్రెడీ ఒక మహాభారతం సినిమా అది కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుని నుంచి వస్తే దానిని బీట్ చేసే వర్క్ తో రావాల్సి ఉంటుంది. మరి చూడాలి నిజంగానే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మహాభారతం పై ప్లాన్ చేసిందా లేక వేరే ఫాంటసీ, పౌరాణిక సినిమానా అనేది.

More from Filmibeat

Read more about: allu arjun trivikram aa22
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X