Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్.. త్రివిక్రమ్ మౌనం వెనుక అసలు కారణం ఇదే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక అంతకంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ వచ్చి చివరి వరకు ఉండి సినిమా గురించి అనేక రకాలుగా మాట్లాడారు.
ఇక సినిమాకు వెన్నుముకగా నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలస్యంగా ఎందుకు వచ్చారు. అంతేకాకుండా ఆయన ఈవెంట్ లో ఎందుకు మాట్లాడలేదు. దాని వెనుక కారణం ఏమిటి అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు కారణం ఏమిటి అనే విషయం లోకి వెళితే....

గ్రాండ్ గా ఈవెంట్
భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. హైదరాబాద్ యూసుఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా హాజరయ్యారు. ఇక భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు.

మళ్ళీ కనిపించలేదు
అయితే ఈ సినిమా తెరపైకి రావడానికి అసలు కారణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈవెంట్ లో ఎందుకు అంతగా సైలెంట్ గా ఉన్నారు అనేది కొందరిలో ప్రశ్నార్థకంగా మారింది దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రావడమే ఆలస్యం గా వచ్చారు. ఇక కేటీఆర్ ను కలిసిన అనంతరం త్రివిక్రమ్ మళ్ళీ కనిపించలేదు.

ఫ్యాన్స్ అప్సెట్
అభిమానులు అందరూ కూడా ఎక్కువగా భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ కోసమే ఎదురు చూశారు. బండ్ల గణేష్ కూడా ఈవెంట్ కు రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత అప్సెట్ అయ్యారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే విషయం గురించి ఆరా తీయగా ఆయనే కావాలని మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాంటి కామెంట్స్ రావడంతో
భీమ్లా నాయక్ సినిమా మొదలయినప్పటి నుంచి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుండి సినిమాను నడిపించారు. స్క్రీన్ ప్లే మాటలు అందింది సినిమాకు మరింత బలాన్ని ఇచ్చారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ అని సాగర్ కె చంద్ర కేవలం పేరుకు మాత్రమే దర్శకుడు అనే కామెంట్స్ చాలా వచ్చాయి.
Recommended Video

అందుకే మాట్లాడకుండా..
ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయని దర్శకుడు త్రివిక్రమ్ వేడుకలో చాలా సైలెంట్ గా ఉన్నాడు. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్రను హైలెట్ చేయాలని ఆలోచనతోనే త్రివిక్రమ్ కనిపించకుండా ఉన్నారని తెలుస్తోంది. ఒక విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనేదే అని ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నప్పటికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ స్పీచ్ మిస్సయ్యిందని బాధగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











