కోబలిపై మరోసారి త్రివిక్రమ్ స్పెషల్ ఫోకస్.. కామెడీ, పాటలు లేకుండా ఆ స్టార్ హీరోతో..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కామన్ అడియెన్స్ కోరుకునే అన్ని రకాల అంశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే మొదటిసారి ఆయన తన ఫార్ములాను దాటి మరొక కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే కోబలి ప్రాజెక్టు. ఈ స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ గత పదేళ్లుగా చర్చలు జరుపుతున్న కుదరడం లేదు. ఇక మెత్తనికి ఆయన అనుకున్న అగ్ర హీరోతోనే స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

మొదటిసారి కోబలితో ప్రయోగం..
త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదటి నుంచి కూడా ఎక్కువగా ఫ్యామిలీ జానర్ లోనే మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలను తెరకెక్కించాడు. బంధాలు విలువలు అంటూనే తనదైన శైలిలో యాక్షన్ సీక్వెన్స్ లను కూడా సరికొత్తగా చూపించాడు. ఆయన ఇప్పటివరకు ఆ బార్డర్ దాటి మరో జానర్ ను టచ్ చేయలేదు. ఇక మొదటిసారి కోబలితో ప్రయోగానికి సిద్ధమైనట్లు సమాచారం.

మొదటిసారి అవన్నీ లేకుండా
త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్ లు, ప్రాసలు, మంచి మెలోడీ సాంగ్స్ లేకుండా ఊహించలేము. కానీ మొదటిసారి అవన్నీ లేకుండా తనదైన శైలిలో పర్ఫెక్ట్ హై వోల్టేజ్ లో ర్రా మూవీ తీయాలని అనుకుంటున్నాడు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇక చివరి నిమిషంలో రిస్క్ ఎందుకని ఆజ్ఞాతవాసి చేశారు.

మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే
ఇక త్రివిక్రమ్ మళ్ళీ కోబలి ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ తోనే తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అయితే ఆ ప్రాజెక్టును త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడట. ఆయన దర్శకత్వంలో చేస్తే అభిమానులు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయని అందుకే మరొక దర్శకుడి చేతుల్లో పెట్టవచ్చని సమాచారం.
Recommended Video

తెలివైన దర్శకుడు కావాలి
కథ అయితే పర్ఫెక్ట్ గా సెట్టయిందట. కానీ త్రివిక్రమ్ రాసిన డిఫరెంట్ కథను డైరెక్ట్ చేయాలి అంటే తెలివైన దర్శకుడు కావాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఫోకస్ కొంతమంది యువ టాలెంటెడ్ దర్శకులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో సినిమా సెట్టయిన అనంతరం కోబలిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. పవన్ కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి కోబలి వచ్చే ఎడాది సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











