మహేష్ బాబు సినిమా విషయంలో మారో ఆలోచనకు వచ్చిన త్రివిక్రమ్.. త్వరలోనే మేజర్ అప్డేట్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా అతడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ రెండు సినిమాలు అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఈ సారి మాత్రం ఎలాగైనా అంతకుమించి అనేలా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఈ సినిమా చివరి షెడ్యూల్ కూడా తుది దశకు చేరుకుంది. ఇక సినిమాను మే 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇక వీలైనంత త్వరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను కూడా పూర్తి చేయాలని మహేష్ బాబు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా మహేష్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టించారు.. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫైనల్ చేయగా మరో హీరోయిన్ కోసం దర్శకుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధారణంగా తన ప్రతి సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ సీబీసుకోవాలని కమర్షియల్ గా ఆలోచిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే ఇక మహేష్ బాబు 28వ ప్రాజెక్టులో కూడా అదే తరహాలో ఇద్దరు హీరోయిన్లు ఉండేలా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఆయన దృష్టి ఎక్కువగా ఖిలాడి సినిమా హీరోయిన్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే మీనాక్షి చౌదరి ఫిక్స్ అయినట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ఇప్పుడు ఖిలాడి సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లపై కూడా దృష్టి పుట్టినట్లు సమాచారం. మీనాక్షి చౌదరి లేకపోతే డింపుల్ హయాతిని ఫైనల్ చేసే ఛాన్స్ అన్నట్లుగా తెలుస్తోంది. నేడు విడుదలైన ఖిలాడి సినిమాకు అయితే కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన్నప్పటికీ హీరోయిన్స్ విషయంలో మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఇద్దరు కూడా గ్లామర్ ప్రజెంటేషన్ లో పోటాపోటీగా నటించారు అని కూడా రివ్యూలలో ప్రత్యేకంగా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలలో కూడా కామెంట్స్ బాగానే వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











