Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు తరువాత త్రివిక్రమ్ చేతిలో మరో అగ్ర హీరో.. 75వ సినిమా కోసం స్పెషల్ స్టోరీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ అందుకుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అగ్ర హీరోలతో వర్క్ చేశారు అంటే సినిమా ఎనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తుంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కామిట్మెంట్ లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. మహేష్ తరువాత కూడా ఒక సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను..
ప్రస్తుతం స్టార్ దర్శకులు కూడా హీరోలతో పాటు ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. హీరోలు దొరకరేమో అని దర్శకులు. దర్శకులు బిజీగా ఉంటారేమో అని హీరోలు.. ఇలా రెండు వైపులా ఆలోచనలు ఎక్కువవ్వడంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ఒప్పేసుకుంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమాతో..
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలకు ఇష్టం బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు సడన్ గా ఆయన అంచనాలు కూడా తప్పుతుండడంతో కథపై నమ్మకం కలిగితే గాని కొందరు స్టార్స్ ఒప్పుకోవడం లేదు. అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాటల మాంత్రికుడితో వర్క్ చేయడానికి కొంత ఆలోచిస్తున్నారు కూడా.
మరోసారి ఋజువయ్యింది
కానీ త్రివిక్రమ్ కసితో తీస్తే అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఈజీగా అందుకుంటాడు అని మరోసారి ఋజువయ్యింది. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ప్రాజెక్టు సెట్టయినప్పటికి మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది. ఇక మహేష్ బాబుతో మరొక కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.
Recommended Video
వెంకటేష్ 75వ సినిమా కోసం..
ఇక మహేష్ బాబు తరువాత మరొక స్టార్ హీరో సినిమా చేయడానికి ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు. విక్టరీ వెంకటేష్. వెంకీని ఇంతవరకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయకపోయినప్పటికి మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథ మాటలు అందించాడు. ఇక చాలా కాలం నుంచి వీరు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక వెంకీ 75వ సినిమాకు త్రివిక్రమ్ మరొక స్పెషల్ కథతో దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.