Bheemla Nayak మూవీకి త్రివిక్రమ్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. డైరెక్షన్ చేయకున్నా అన్ని కోట్లా!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీమేక్‌ మూవీలు, మల్టీస్టారర్లు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడం వల్లే టాలీవుడ్‌లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఎన్నో చిత్రాలు పట్టాలపై ఉన్నాయి. అందులో మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న బడా మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' ఒకటి. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తోన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా ఆయన రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

‘భీమ్లా నాయక్' రెడీ అవుతున్నాడు

‘భీమ్లా నాయక్' రెడీ అవుతున్నాడు

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. టాలీవుడ్ హంక్ రాణా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఆ మూవీ రీమేక్.. ఇద్దరు హీరోలు ఇలా

ఆ మూవీ రీమేక్.. ఇద్దరు హీరోలు ఇలా

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' మూవీకి భీమ్లా నాయక్ రీమేక్‌గా వస్తోంది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో ఇది తెరకెక్కుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైంది.

భీమ్లా నాయక్ నుంచి అన్నీ అదిరేలా

భీమ్లా నాయక్ నుంచి అన్నీ అదిరేలా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ దక్కింది.

 ఈ సినిమాలో భాగం అయిన త్రివిక్రమ్

ఈ సినిమాలో భాగం అయిన త్రివిక్రమ్


భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆయన మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాదు, 'లాలా భీమ్లా' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను కూడా గురూజీనే స్వయంగా రాసిన విషయం తెలిసిందే.

పూర్తిగా దానిపైనే దృష్టి సారించాడు

పూర్తిగా దానిపైనే దృష్టి సారించాడు

చాలా రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేశాడు. దాని తర్వాత ఎన్టీఆర్‌తో రెండో సినిమాకు సన్నాహాలు జరిపాడు. అయితే, ఇది వర్కౌట్ కాకపోవడంతో ఆపేశారు. ఆ వెంటనే 'భీమ్లా నాయక్' మీదే పూర్తిగా దృష్టి సారించాడు. అంతేకాదు, ఇది పూర్తయ్యే వరకూ వేరే సినిమా లేకుండా ప్లాన్ చేశాడు. దీని తర్వాతే మహేశ్ సినిమా స్టార్ట్ కానుంది.

త్రివిక్రమ్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్

త్రివిక్రమ్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్

'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ క్వాలిటీ కోసం అతడు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా భాగం చేశాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి గానూ గురూజీ ఏకంగా రూ. 15 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని తెలిసింది.

ఆయన కంటే ఎక్కువే అని ప్రచారం

ఆయన కంటే ఎక్కువే అని ప్రచారం

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఈ సినిమా కోసం తీసుకునే మొత్తం కంటే.. పర్యవేక్షణ చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X