సడెన్ ట్విస్ట్.. మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయబోతున్న త్రివిక్రమ్!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత అదరగొడ్తున్నారు. ఖైదీ నెం 150 చిత్రం రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం చిరు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్స్ అంతా చిరంజీవితో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. సైరా తరువాత చిరు నటించబోయే చిత్రాల విషయంలో మెగా అభిమానులని ఉక్కిరిబిక్కిరి చేసే వార్తలు వినిపిస్తున్నాయి.

కొరటాల, బోయపాటి ఎదురుచూపులు
సైరా నరసింహా రెడ్డి తరువాత చిరంజీవి నటించబోయేది కొరటాల శివ దర్శత్వంలో అని దాదాపుగా ఖాయం అయిపోయింది. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కొరటాల చిత్రం తరువాత బోయపాటి రెడీగా ఉన్నాడు. ఖైదీ నెం 150 పూర్తయినప్పటి నుంచి చిరుతో సినిమా చేయడానికి బోయపాటి ప్రయత్నిస్తున్నారు.

సడెన్ ట్విస్ట్
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఊహించని విధంగా ఉంది.మాటల మాంత్రికుడి దర్శత్వంలో నటించేందుకు చిరంజీవి ఆసక్తిగా ఉన్నాడని.. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ వినిపించిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్లు కుదిరితే కొరటాల చిత్రం తరువాత త్రివిక్రమ్, చిరు చిత్రం సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.

చిరు వయసుకు తగ్గట్లుగా
చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వయసుకు తగ్గట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. చాలా ఆసక్తికరంగా ఉండడంతో కథ సిద్ధం చేయమని మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్లు తెలుస్తోంది. ఓ బడా నిర్మాత ఈ చిత్రాన్ని టేకప్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ చిత్రం పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి త్రివిక్రమ్ ఈ లోపు బన్నీతో ఓ సినిమా చేయబోతున్నారు.

2019 చివర్లో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం 2019 వేసవిలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో నటించే చిత్రం అదే ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాతే త్రివిక్రమ్, చిరంజీవి చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











