మళ్లీ జల్సా చేస్తున్న పవన్ కళ్యాణ్

By Srikanya

పవన్ కళ్యాణ్ త్వరలో మళ్లీ జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం అప్పట్లో మంచి హిట్ అయ్యింది. దాంతో ఆ కాంబినేషన్ లో చిత్రం చేసి హిట్ కొట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకు పంజా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పంజా చిత్రంతో నష్టపోయిన వారికి కాంపన్షేషన్ గా పవన్ ఈ చిత్రం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక ఈ మేరకు త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో చర్చలు జరుగుతున్నాయి. ఆయన పవన్ ని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పటం ..వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగాయని చెవ్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ..దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతన్న గబ్బర్ సింగ్ చిత్రం క్రేజీ ప్రాజెక్టుగా నిలవనుంది. అలాగే త్రివిక్రమ్ ..బన్నీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ కామిడీగా రూపొందుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కి మళ్లీ క్రేజ్ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X