ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రమ్ బాక్సాఫీస్ షేర్స్.. డబుల్ పేమెంట్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రాజమౌళి తరువాత ఇప్పుడు టాప్ లో ఉన్న దర్శకుల్లో మాటల మాంత్రికుడు కొనసాగుతున్నాడు. ఇటీవల వచ్చిన అల..వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ కూడా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ బెస్ట్ దర్శకుల్లో ఒకరని తేలిపోయింది.
ఇక ఆ ఎఫెక్ట్ తరువాత సినిమాకు కూడా గట్టిగానే పడనుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమా అనంతరం తారక్ నుంచి రాబోయే సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ అందుకోవడమే కాకుండా ప్రాఫిట్స్ లో కూడా షేర్స్ ఉంటాయట. అంటే డబుల్ పేమెంట్స్ అన్నమాట.

ముందే స్ట్రాంగ్ రెమ్యునరేషన్ అందుకునే త్రివిక్రమ్ ఆ తరువాత సక్సెస్ ని బట్టి లాభాల్లో కూడా మరో మంచి పేమెంట్ అందుకునే ఛాన్స్ ఉంది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కష్టమే.. అరవింద సమేతతో ఆల్ రెడీ ఒకసారి ఈ కాంబినేషన్ కి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఇంకాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఆ సినిమా కలెక్షన్స్ మరీంత పెరిగేవి. ఇక నెక్స్ట్ సినిమాతో త్రివిక్రమ్ తప్పకుండా మరొక ఇండస్ట్రీ హిట్ కొడతాడాని టాక్ వస్తోంది. మరి ఆ సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











