Trivikram Srinivas:దెబ్బకు రెమ్యునరేషన్‌ డబుల్ చేసిన త్రివిక్రమ్‌.. మహేష్ తో సమానంగా ?

సాధారణంగా సినిమా విషయంలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది హీరో అనే చెప్పాలి. ఎందుకంటే హీరో కేంద్రంగానే తెలుగు సినిమాలు మొదలవటం నుంచి రిలీజ్ అవ్వడం
వరకు సాగుతూ ఉంటాయి. అందుకే వారికి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ దర్శకుడు ఒకరు ఏకంగా హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన చేస్తున్న తాజా సినిమాకు హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.. వివరాల్లోకి వెళితే

దూరం పెరిగిందని

దూరం పెరిగిందని


అల వైకుంఠపురంలో అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత సినిమా ప్రకటించడానికి చాలా సమయమే పట్టింది. ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమా పక్కకు వెళ్లి త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు సినిమా తెర మీదకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని అందుకే సినిమా చేయడం లేదనే ప్రచారం జరిగింది

 పాన్ ఇండియా లెవల్ లో

పాన్ ఇండియా లెవల్ లో


ఆ ప్రచారానికి ఊతమిచ్చే విధంగా ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ మధ్య ఏదో జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం మీద అటు ఎన్టీఆర్ వైపు నుంచి కానీ ఇటు త్రివిక్రమ్ వైపు నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ అలాంటి సమస్య లేదని ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నామని అది పాన్ ఇండియా లెవల్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు.

లాంఛనంగా

లాంఛనంగా


ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మహేష్ ఎప్పటిలాగే తన సెంటిమెంట్ ప్రకారం కార్యక్రమానికి హాజరు కాలేదు కాని మహేష్ కుమార్తె, మహేష్ భార్య చేతుల మీదుగా సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు హీరోయిన్ పూజ కూడా హాజరైంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయబోతున్నారు అని.

 పాతిక కోట్ల రూపాయల

పాతిక కోట్ల రూపాయల


త్రివిక్రమ్ ఎక్కువగా హారిక హాసిని అలాగే సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థలలోనే సినిమాలు చేస్తారు. ముందు నుంచి కూడా ఆయన రెమ్యూనరేషన్ కాకుండా సినిమాలో వాటా తీసుకుంటారు అనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రచారం మేరకు ఈ సినిమా కోసం త్రివిక్రమ్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిగా చేసిన అల వైకుంఠపురంలోకు పాతిక కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

 మహేష్ తో సమానంగా త్రివిక్రమ్

మహేష్ తో సమానంగా త్రివిక్రమ్


వరుస హిట్లతో ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు దాన్ని డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం అని 50 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని టాక్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు మహేష్ బాబు కూడా 50 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఆయనతో సమానంగా త్రివిక్రమ్ ఛార్జ్ చేస్తున్నారన్నమాట. ఈ అంశం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X