For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak నుంచి షాకింగ్ న్యూస్: త్రివిక్రమ్ దెబ్బకు అదంతా ఔట్.. మరింత లేట్ తప్పదా!

  |

  మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా.. కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య మన హీరోలందరూ మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ తరహాలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో చాలా వరకూ సూపర్ హిట్లుగా నిలవడంతో మిగిలిన వాళ్లూ అదే బాటలో నడుస్తున్నారు.

  ఈ క్రమంలోనే ఇప్పుడు భారీ రేంజ్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  భీమ్లా నాయక్‌తో డేనియెల్ శేఖర్ ఢీ

  భీమ్లా నాయక్‌తో డేనియెల్ శేఖర్ ఢీ

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న చిత్రమే ‘భీమ్లా నాయక్'. విలక్షణ చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  దానికి రీమేక్.. ఇద్దరి పాత్రలు ఇలా

  దానికి రీమేక్.. ఇద్దరి పాత్రలు ఇలా

  సూపర్ హిట్ అయిన మలయాళం చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరును చూపించబోతున్నారు. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది.

  ఇప్పటి వరకూ వచ్చినవన్నీ హిట్లే

  ఇప్పటి వరకూ వచ్చినవన్నీ హిట్లే

  భారీ మల్టీస్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటి రానా గ్లిమ్స్ వీడియో కూడా వచ్చింది. ఇవి అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  భారీ చిత్రంలో భాగమైన త్రివిక్రమ్

  భారీ చిత్రంలో భాగమైన త్రివిక్రమ్

  క్రేజీ కాంబినేషన్‌ రాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆయన మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాదు, ‘లాలా భీమ్లా' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను కూడా గురూజీనే స్వయంగా రాసిన సంగతి తెలిసిందే.

  త్రివిక్రమ్ దెబ్బకు అదంతా ఔట్

  త్రివిక్రమ్ దెబ్బకు అదంతా ఔట్

  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, దీన్ని ఫిబ్రవరి నెలకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ పూర్తైన షూటింగ్‌కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగమై.. చాలా భాగాన్ని కత్తిరించారని తాజాగా తెలిసింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  Prabhas ఫాన్స్ కే ఎందుకిలా ? Radhe Shyam | Bheemla Nayak | Sankranthi 2022| Filmibeat Telugu
  మరింత ఆలస్యం తప్పదా అంటూ

  మరింత ఆలస్యం తప్పదా అంటూ

  ‘భీమ్లా నాయక్'కు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రీషూట్ చేయాల్సి వస్తుందా? చిత్రీకరణ మరింత ఆలస్యం అవుతుందా? ఇదే జరిగితే సినిమా విడుదల కూడా లేట్ అవుతుందా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అసలేం జరుగుతుందో తెలియక తెగ అయోమయానికి గురి అవుతున్నారు.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Now Trivikram Srinivas Editing Work for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X