ఎన్టీఆర్ డిమాండ్.. సమంతకు భారీ ఆఫర్.. త్రివిక్రమ్ ఫిక్స్!! నందమూరి అభిమానులకు పండగే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతిత్వరలో సెట్స్ మీదకు రాబోతున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ అని ఇటీవలే అధికారికంగా తెలిపారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లోకం దృష్టాంతా ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ సమంత అని, ఇందుకోసం ఆమె భారీ పారితోషికం అందుకోబోతోందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

Recommended Video

NTR 30 : Samantha Vs Rashmika | Samantha Likely To Be Roped Opposite NTR || Filmibeat Telugu
కథపై త్రివిక్రమ్ కసరత్తు.. హీరోయిన్ వేట

కథపై త్రివిక్రమ్ కసరత్తు.. హీరోయిన్ వేట

ఇటీవలే అల.. వైకుంఠపురములో సక్సెస్ సాధించి మంచి జోష్‌లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం ఈ సినిమా కథపై కసరత్తులు ప్రారంభించారట. నందమూరి అభిమానులు కోరుకునే విధంగా, తనదైన స్టైల్‌లో కథ సిద్ధం చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. అయితే ఇందులో తన సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఎన్టీఆర్ ఓ ఐడియా ఇచ్చారని సమాచారం.

తెరపైకి రష్మిక, పూజా పేర్లు.. ఈ ఆలోచన అతనిదే

తెరపైకి రష్మిక, పూజా పేర్లు.. ఈ ఆలోచన అతనిదే

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ పూజా హెగ్డే అని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక పేరు బలంగా వినిపించింది. కానీ ఈ ఇద్దరూ కాదని ఇప్పుడు సమంతను సెలెక్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు సమంతను తీసుకోవాలనే ఆలోచన ఎన్టీఆర్‌దే అంటున్నారు.

భారీ ఆఫర్.. ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్

భారీ ఆఫర్.. ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్

అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను సమంతకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని లేటెస్ట్ టాక్. గతంలో ఏ సినిమాకు అందుకోనంతగా ఈ సినిమాకు ఆఫర్ చేయడంతో సమంత కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి సమంత వెంటనే అగ్రీ అయిందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సమంత అనుభవం.. ఆ ఇద్దరితో

సమంత అనుభవం.. ఆ ఇద్దరితో

ఇకపోతే ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను, అటు ఎన్టీఆర్ సరసన నటించిన అనుభవం సమంతకి ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో ఆమె చేసిన మూడు సినిమాలు ''అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ.. ఆ'' భారీ విజయాలను అందుకున్నాయి. అందుకే త్రివిక్రమ్ కూడా సమంతకు ప్రియార్టీ ఇస్తున్నారని తెలిసింది.

పెళ్లి తర్వాత సామ్..

పెళ్లి తర్వాత సామ్..

పెళ్లి తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోన్న సమంత.. తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తా చాటుతోంది. ఇక్కడ ‘అఆ', ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన ఈమె కోలీవుడ్‌లో ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్'లతో సత్తా చాటింది. కాకపోతే ఇటీవలే వచ్చిన 'జాను' మూవీ ఆమెకు నిరాశ మిగిల్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X