SSMB28: మహేష్ సినిమా కోసం సీనియర్ హీరోను రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్.. సీఎం పాత్రలో..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేయబోతున్న SSMB28 పై రోజురోజుకు అనేకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన మహేష్ తనలోని సరికొత్త నటుడిని బయట పెట్టాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ మహేష్ ను మాత్రం సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా మరింత విభిన్నంగా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఒక సీనియర్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ సినిమాలో..

మహేష్ సినిమాలో..

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో పాత్రలు మాత్రం కథలో భాగంగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరటిపళ్ళు అమ్ముకునే వాడి పాత్ర కూడా ఊహించని విధంగా పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచి పోతూ ఉంటుంది. ఆ విధంగా ప్రతీ క్యారెక్టర్ ను డిజైన్ చేసుకునే త్రివిక్రం మహేష్ సినిమాలో కూడా చాలా మంచి పాత్రలను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మిస్ చేసుకోవద్దని..

మిస్ చేసుకోవద్దని..


మహేష్ బాబుతో త్రివిక్రమ్ గత ఐదేళ్ల క్రితమే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు మహేష్ బాబు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అంతేకాకుండా మహేష్ ఖాళీగా ఉన్నప్పుడు త్రివిక్రమ్ బిజీగా ఉంటున్నాడు. వీరిద్దరికీ సరైన స్లాట్ అయితే దొరకడం లేదు. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ ను మిస్ చేసుకోకూడదు అని త్రివిక్రమ్ కొంత ఎక్కువ కాలం పాటు ఎదురు చూశాడు.

లాంచ్ ఈవెంట్ ఫినిష్..

లాంచ్ ఈవెంట్ ఫినిష్..

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో మొదలు పెట్టబోతున్నారు. ఇదివరకే SSMB28 ప్రాజెక్టును పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే మరొక హీరోయిన్ కోసం కూడా త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నాడు.

ముఖ్యమంత్రి పాత్ర కోసం..

ముఖ్యమంత్రి పాత్ర కోసం..

SSMB28 ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే కథలో భాగంగా ముఖ్యమంత్రి పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకం కానుంది. ఇక ఆ పాత్ర కోసం ఒక సీనియర్ హీరో ను ఇటీవల త్రివిక్రమ్ సంప్రదించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Indraganti Mohankrishna Speech | Aa Ammayi Gurinchi Meeku Cheppali | Filmibeat Telugu
మోహన్ లాల్ ఫిక్స్?

మోహన్ లాల్ ఫిక్స్?


ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో సీఎం పాత్ర కోసం మోహన్ లాల్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మలయాళం సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మోహన్ లాల్ అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబో నాటే తప్పకుండా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని చెప్పవచ్చు. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X