కనుమరుగైన ఆ హీరోపై త్రివిక్రమ్ ఫోకస్.. ఆ సినిమా కోసమే చర్చలు?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా తర్వాత వీరి కలయికలో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలకు మించి తెరకెక్కిస్తారు అనే నమ్మకం అయితే ఆడియన్స్ లో ఉంది. ఇక ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అందరూ మర్చిపోయిన ఒక హీరోను త్రివిక్రమ్ SSMB 28 ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పర్ఫెక్ట్ కథ
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది నుంచి ఒక సినిమా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఒక కథలపై చర్చలు కూడా జరిగాయి. కానీ మహేష్ బాబు కథ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వరకు కూడా త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొత్తానికి ఇటీవల చెప్పిన ఫైనల్ కథ నచ్చడంతో అఫీషియల్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా హీరోయిన్గా నటిస్తుండగా. మరొక హీరోయిన్ పాత్ర కోసం చర్చలు కొనసాగుతున్నాయి.

ముఖ్యమైన పాత్ర కోసం
త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో చాలా బలమైన పాత్రలను హైలెట్ చేస్తాడు అని చెప్పవచ్చు. ఇక ఆ పాత్రలకు తగ్గట్టుగా క్యాస్టింగ్ ఉంటేనే సినిమాకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తాడు. అందుకే ఆయన కొంత మంది ప్రముఖ నటీనటులు ను సెలెక్ట్ చేసుకుని చాలా అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక SSMB ప్రాజెక్ట్ లో మరొక ముఖ్యమైన పాత్ర కోసం యువ హీరో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ హీరోల పేర్లు వైరల్
అల..వైకుంఠపురములో సినిమాలో ఎలాగైతే సుశాంత్ ను ప్రత్యేకమైన పాత్రలతో హైలెట్ చేశారో అలాగే త్రివిక్రమ్ మరొక యువ హీరోను కూడా మహేష్ బాబు సినిమా కోసం అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నాని అలాగే సుధీర్ బాబు పేర్లు కూడా వినిపించాయి. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే అని టాక్ వస్తోంది. కచ్చితంగా అయితే త్రివిక్రమ్ షూటింగ్ మొదలయ్యే లోపు సెకండ్ హీరో విషయంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

నందమూరి హీరోపై త్రివిక్రమ్ ఫోకస్?
ప్రస్తుతం వినిపిస్తున్న మరో టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఒక ముఖ్యమైన పాత్ర కోసం అందరూ మర్చిపోయిన ఒక హీరోను మళ్ళీ వెండితెరపై చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్న అని తెలుస్తోంది. కెరీర్ మొదట్లో హీరోగా సెటిల్ అవ్వడానికి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి ఆ తర్వాత అపజయాల కారణంగా డౌన్ అయిపోయిన తారకరత్న చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు.
Recommended Video


ఒక మంచి పాత్ర చేయించాలని..
మధ్య మధ్యలో తారకరత్న కొన్ని విభిన్నమైన సినిమాలు చేసే ప్రయత్నం చేశాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే అతనితో ఒక మంచి పాత్ర చేయించాలని త్రివిక్రమ్ ఆలోచించినట్లు గా తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలో కథకు కీలకమైన పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











