For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి బాటలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ రేంజ్‌ అంటే అదే మరి.. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్!!

    |

    వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న ఆయన.. తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై త్రివిక్రమ్ కూడా రాజమౌళి లాగే ఆలోచిస్తున్నారట. జక్కన్న లాగే తానూ ఓ గ్లామర్ బ్యూటీని అదికూడా బాలీవుడ్ భామను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా..

    Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie
     RRRలో ఎన్టీఆర్.. జక్కన్న స్కెచ్

    RRRలో ఎన్టీఆర్.. జక్కన్న స్కెచ్

    బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు RRR. దానయ్య సమర్పణలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరి జోడీల విషయంలో మాత్రం జక్కన్న పెద్ద స్కెచ్చే వేశారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ లను రంగంలోకి దించుతున్నారు.

     రాజమౌళి బాటలో త్రివిక్రమ్

    రాజమౌళి బాటలో త్రివిక్రమ్

    RRR షూటింగ్ పూర్తికాకముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఓ డిసీజన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం రాజమౌళి హాలీవుడ్ భామను సెట్ చేశారు కాబట్టి తాను బాలీవుడ్ భామను సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు.

    ఆ బ్యూటీనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్!

    ఆ బ్యూటీనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్!

    గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. హారిక హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్ అయ్యారట.

    రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో..

    రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో..

    ఇకపోతే మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఎప్పటినుంచో వినిపిస్తోంది. గతంలో 'అరవింద సమేత' మూవీలో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినందున ఆమె వైపే మొగ్గు చూపారట దర్శకనిర్మాతలు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

    అయిననూ పోయి రావలె హస్తినకు..

    అయిననూ పోయి రావలె హస్తినకు..

    మరోవైపు ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ ఇదే టైటిల్ ఫిక్స్ చేశాయని చూస్తున్నారట. జులై నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలనేది మేకర్స్ ప్లాన్.

    ఎన్టీఆర్ రేంజ్‌.. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్

    ఎన్టీఆర్ రేంజ్‌.. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్

    ఏదేమైనా ఎన్టీఆర్ కోసం రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి బడా దర్శకులు హాలీవుడ్, బాలీవుడ్ భామల వంక చూస్తున్నారంటే ఇక ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 2021లో ఎన్టీఆర్ హంగామాతో థియేటర్స్ హోరెత్తిపోవాల్సిందే. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్.

    English summary
    After RRR Movie Ntr will act in Trivikram Srinivas direction. As per latest talk in this movie Janhvi Kapoor, Pooja Hegde are selected as heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X