twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ రెమ్యునేషన్ అంత పెంచాడా??

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరసగా రెండు బ్లాక్ బస్టర్స్..జులాయి, అత్తారింటికి దారేది... ఓ దర్శక,రచయితను తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఛెయిర్ లో కూర్చోబెట్టాయి. దాంతో ఆయన రెమ్యనేషన్ దానంతట అదే పెరుగుతుంది. ఆయనతో పనిచేయాలనుకునేవాళ్లు రెమ్యునేషన్ పెంచి మరీ ఆయన్ని పట్టుకుంటారు. ఇప్పుడు అదే త్రివిక్రమ్ కి జరుగుతోంది. ఆయన తన రెమ్యునేషన్ ని 12 కోట్లుకు పెంచేసారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదే విషయాన్ని ఓ పాపులర్ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించి ఖరారు చేసింది.

    ఇంతకు ముందు అథ్తారింటికి దారేది చిత్రానికి 10 కోట్లుతీసుకున్న ఆయన తన తదుపరి చిత్రానికి ఈ 12 కోట్లు మొత్తాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే డైరక్టర్ గా ఓవర్ నైట్ లో మారి పోయారు. శ్రీను వైట్ల,రాజమౌళి ఇద్దరూ పది కోట్లు మాత్రమే డిమాండ్ చేస్తూండగా...త్రివిక్రమ్ 12 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. కలెక్షన్స్ రికార్డ్లులు తను చేస్తున్న చిత్రానికి వస్తున్నప్పుడు తన రెమ్యునేషన్ పెంచి రికార్డ్ క్రియేట్ చేయటంలో వింతేముంది అంటున్నారు.

    ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్‌ దర్శకుడిగా అఖిల్‌ అరంగేట్రం ఉండబోతోందని వార్తలు మీడియాలో వచ్చాయి‌. అయితే అఖిల్ ఎంట్రీ కి సంబంధించి నాగార్జున - త్రివిక్రమ్‌ల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే అఖిల్‌ మాత్రం అలాంటిదేం లేదు... అంటున్నాడు. ఇప్పటి వరకూ తన సినిమాకి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదని... ఒకవేళ త్రివిక్రమ్‌తో అవకాశం వస్తే సంతోషిస్తానని చెబుతున్నాడు అఖిల్‌. ''త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నా అనే వార్తల్లో నిజం లేదు. దర్శకుడు ఎవరనేది తెలిస్తే నేనే చెబుతా'' అని ట్వీట్‌ చేశాడీ సిసింద్రీ. 'అత్తారింటికి దారేది' తరవాత త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.

    ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా తియ్యచ్చా... అంటే తీసి చూపిస్తానంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో 'కోబలి' అనే చితం రూపొందనుంది. రాయలసీమ ప్రాంతంలో జంతువులను దేవుడికి బలి ఇవ్వడాన్ని 'కోబలి'అనే పేరుతో వ్యవహరిస్తారని, ఈ చిత్రానికి కమర్షియల్ అంశాల గొడవ లేకుండా కథను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలియజేశారు. అయితే అసలు పవన్ కళ్యాణే కమర్షియల్ ఎలిమెంట్ కదా...ఆయన చేయటంతోటే కమర్షియల్ అప్పీల్ వస్తుంది కదా అంటున్నారు.

    English summary
    The success of two films is going to reflect in Trivikram Srinivas pay cheque as well. It is learnt that the filmmaker has hiked his price to Rs 12 crore per film. That catapults Trivikram into the elite club of Tollywood filmmakers who rake in excess of RS 10 crore per film. Rajamouli and Srinu Vaitla are the other two directors who demand remuneration in excess of Rs 10 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X