హాట్ న్యూస్: త్రివిక్రమ్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రం
త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ సెట్ అయిందని ఫిల్మ్ నగర్ సమాచారం. రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన లైన్ ఎన్టీఆర్ కు బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. కె.ఎల్.నారాయణ నిర్మించే ఈ చిత్రం ఈ సంవత్సరం ఆఖరున గానీ 2012 జనవరిలో గాని ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి యాక్షన్ కామిడీగా ఈ స్క్రిప్టు రెడీ చేసారని చెప్తున్నారు. ఇక చాలాకాలంగా ఎన్టీఆర్..త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారని ఇన్నాళ్ళకు కుదిరిందని నిర్మాతలు సంబరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్..సురేంద్రరెడ్డితో ఊసరవిల్లి, బోయపాటి శ్రీను తో టైగర్, శ్రీను వైట్ల చిత్రం కమిటై ఉన్నారు. ఇక త్రివిక్రమ్ త్వరలో అల్లు అర్జున్ ని డైరక్ట్ చేసే అవకాశం ఉంది. ఖలేజా తర్వాత త్రివిక్రమ్ ఇంకా ఏ చిత్రమూ ఓకే చేయించుకోలేదు. ఆ మధ్యన వెంకటేష్ తో సినిమా అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు.


Click it and Unblock the Notifications











