For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ - త్రివిక్రమ్ మూవీ వివరాలు లీక్: అది వర్కింగ్ టైటిల్ మాత్రమే.. హాలీవుడ్ రేంజ్‌లో హీరో పాత్ర

  |

  కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లో ఉన్న అతడు వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. మరిన్ని ప్రాజెక్టులను కూడా ఓకే చేసుకుంటున్నాడు. ఇందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోతున్న సినిమా కూడా ఉంది. ఇటీవలే దీని ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

  వాళ్లను టార్గెట్ చేసే ‘సర్కారు వారి పాట'

  వాళ్లను టార్గెట్ చేసే ‘సర్కారు వారి పాట'

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న చిత్రమే ‘సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దీన్ని రూపొందిస్తున్నాడు. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసే వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ దీన్ని తీస్తున్నారు.

  రాజమౌళితో సినిమా... క్లారిటీ రావట్లేదు

  రాజమౌళితో సినిమా... క్లారిటీ రావట్లేదు

  గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది చెప్పలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఏ జోనర్‌లో రూపొందనుంది? ఏ రేంజ్‌లో దీన్ని తీస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

  మరికొందరు డైరెక్టర్లతో మహేశ్ చర్చలు

  మరికొందరు డైరెక్టర్లతో మహేశ్ చర్చలు

  రాజమౌళితో రూపొందనున్న సినిమా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో.. ఈ గ్యాప్‌లో మరిన్ని చిత్రాలను చేయాలని మహేశ్ బాబు డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో పలువురు దర్శకులతో కథా పరమైన చర్చలు కూడా జరిపాడు. అందులో వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ఉన్నారనే టాక్ బాగా వినిపించింది.

  త్రివిక్రమ్‌తో మూడో సినిమాకు సిగ్నల్

  త్రివిక్రమ్‌తో మూడో సినిమాకు సిగ్నల్

  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రమే ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుందని కూడా ప్రకటన సమయంలోనే వెల్లడించారు.

  మహేశ్ - త్రివిక్రమ్ మూవీ వివరాలు లీక్

  మహేశ్ - త్రివిక్రమ్ మూవీ వివరాలు లీక్

  త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు సినిమాను ప్రకటించినప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సినిమా కథ.. టైటిల్.. కాస్ట్ ఇలా ఎన్నో అంశాలు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలియక ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో మహేశ్ - త్రివిక్రమ్ మూవీ వివరాలు లీక్ అయ్యాయి.

  SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
  అది వర్కింగ్ టైటిల్ మాత్రమే.. ఆ పాత్ర

  అది వర్కింగ్ టైటిల్ మాత్రమే.. ఆ పాత్ర

  ఈ సినిమాకు ‘పార్థు' అనే టైటిల్ పెడుతున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమచారం ప్రకారం.. అది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనట. దీనికి మరో స్పెషల్ టైటిల్ పెట్టబోతున్నారని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా నటిస్తున్నాడని కూడా తెలిసింది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Mahesh Babu was recently seen in the Telugu-Tamil bilingual movie, Bhahmotsavam, which was released in May 2016. The movie received a poor response at the box office. However, Maheshs performance was praised by the audience. His other projects include Spyder (2017), Bharat Ane Nenu (2018), Maharshi (2019) and Sarileru Neekevvaru (2020).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X