మరోసారి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఆయన ఒక హీరోతో గాని హీరోయిన్ తో గాని స్నేహపూర్వకంగా కనెక్ట్ అయ్యారు అంటే వారితో వరుసగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పవన్,.మహేష్, ఇలియానా, సమంత, అల్లు అర్జున్, పూజా హెగ్డే వంటి వారితో గ్యాప్ టూ గ్యాప్ వర్క్ చేశారు.
ఇక అరవింద సమేత తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మొదటిసారి ఈ కాంబినేషన్ కలుస్తుండడంతో అభిమానుల్లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక మళ్ళీ అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో సినిమాలు బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక మరోసారి అంతకంటే హై రేంజ్ లో హిట్టుకొట్టాలని త్రివిక్రమ్ 2023లో బన్నీతో ఒక సినిమా చేయడానికి డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











