త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో
మహేష్ తో చిత్రం గత రెండు సంవత్సరాలు గా రూపొందిస్తున్న దర్శక,రచయిత త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రంకు లేటెస్ట్ గా సైన్ చేసారని తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు..పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఇదే బ్యానర్ పై ప్రభాస్ తో ఆయన నిర్మించిన 'డార్లింగ్" చిత్రం రూపొందించారచారు. గతంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా" చిత్రం మంచి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక 'జల్సా" షూటింగ్ సమయంలో పవన్-త్రివిక్రమ్ మంచి సన్నిహితులయ్యారు. ఆ చిత్రం ఆడియో వేడుకలోనే నేను మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు పవన్ ప్రకటించాడు. ప్రస్తుతం జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటుడు, నిర్మాత గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించే చిత్రంలో పవన్ తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఇది హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్" ఆధారంగా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ నుంచి విదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











