త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్.. బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారో తెలిస్తే షాక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

త్రివిక్రమ్- ఎన్టీఆర్ ఒప్పందం
గతంలో 'అరవింద సమేత' షూటింగ్ చేస్తున్న సమయం లోనే జూనియర్ ఎన్టీఆర్‌తో మరో ప్రాజెక్ట్ చేస్తానని త్రివిక్రమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించారట మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ నిమగ్నమయ్యారని తెలుస్తోంది.

భారీ బడ్జెట్.. ఎంత కేటాయిస్తున్నారో తెలుసా?
ఇక ఈ సినిమా కోసం కేటాయించబోతున్న బడ్జెట్ విషయమై తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో ఆసక్తి నింపుతోంది. 'అరవింద సమేత'లా కాకుండా ఈ సినిమాను ఏకంగా 200 కోట్లు పెట్టి రూపొందించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ మేరకు కొందరు నిర్మాతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్.

ముమ్మరంగా ఏర్పాట్లు.. త్రివిక్రమ్ స్కెచ్
నిజానికి ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవిలలో ఎవరితోనైనా ఒకరితో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని భావించారంతా. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తోనే కన్ఫర్మ్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో సినిమా కోసం త్రివిక్రమ్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారట.
Recommended Video

ఇటు త్రివిక్రమ్.. అటు ఎన్టీఆర్
ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ ఇద్దరూ ఫ్రీ కానున్నారు. అప్పుడే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టనున్నారు. మరోసారి త్రివిక్రమ్- ఎన్టీఆర్ కలయిక అనేసరికి నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది.


Click it and Unblock the Notifications











