పూజా హెగ్డేకు త్రివిక్రమ్ ఆఫర్.. మరోసారి ఓటు ఆమెకే!
ప్రస్తుతం యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. ఆమెకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలందరితో రొమాన్స్ చేసే అవకాశం పట్టేస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ తో జోడీ కట్టి భారీ బ్లాక్‌బస్టర్స్ కథలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగానే మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ నుంచి ఆమెకు పిలుపొచ్చినట్లు సమాచారం.
ఒకే హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేయడం త్రివిక్రమ్‌కి అలవాటు. గతంలో ఇలియానాతో వరుసగా రెండు సినిమాలు చేసిన ఆయన, సమంతతో మూడు సినిమాలు చేశారు. ఇదే బాటలో తాజాగా పూజా హెగ్డేతో వరుసగా అరవింద సమేత, అల.. వైకుంఠపురములో సినిమాలు చేసి ఇప్పుడు మరో సినిమా కోసం ఆమెనే పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది.

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఇందులో హీరోయిన్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఆమెతో చేసిన గత రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, పైగా చిత్రసీమలో పూజాకు సూపర్ పాపులారిటీ ఉండనే కోణంలో ఆలోచించి పూజనే నాయికగా ఎంచుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట. మరోవైపు ఇదే సినిమా కోసం రష్మిక పేరు కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. చూడాలి మరి చివరకు ఎన్టీఆర్ సరసన ఏ బ్యూటీ ఫైనల్ అవుతుందో!.


Click it and Unblock the Notifications











