త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా బాటలోనే.. అందుకే కొత్త టైటిల్ కోసం వేట!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాన్ ఇండియా ప్లాన్ తో ఒక సినిమాను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో సినిమాతో తన మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు. ఇక తనకంటే చిన్న స్థాయి దర్శకులు కూడా పాన్ ఇండియా బాట పట్టడంతో త్రివిక్రమ్ కూడా అదే దారిలో మొదటి ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు.

నెక్స్ట్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది. అయితే సడన్ గా ఎన్టీఆర్ 30వ సినిమాకు టైటిల్ ని మార్చాలని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పాన్ ఇండియా ఆలోచనే అని అర్ధమవుతోంది. RRR తరువాత ఎన్టీఆర్ మార్కెట్ ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Trivikram srinivas pan india plan with ntr 30th project

అందుకే త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30వ సినిమాను కూడా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టైటిల్ కూడా అన్ని భాషల వారికి నచ్చేలా ఉండాలని ఒక క్యాచీ టైటిల్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఒక స్పెషల్ అప్డేట్ రానుంది. హరిక హాసిని ప్రొడక్షన్ హౌజ్ తో పాటు కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ లో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X