కల్కిని మించిన కథతో అల్లు అర్జున్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో త్రివిక్రమ్!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో ప్రకంపనలు తాజా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సెన్సేషనల్ మల్టీ స్టారర్ "కల్కి 2898 ఎడి" అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంలో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో ప్రభాస్ నటించగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి పలువురు దిగ్గజ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు బిగ్ బడ్జెట్ సినిమాల్లో కల్కి కూడా ఒకటి కాగా ఇక నుంచి కూడా మరిన్ని భారీ సినిమాలు మన టాలీవుడ్ సినిమా నుంచి రానున్న రోజుల్లో రానున్నాయి.

కాగా ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటారు పలువురు స్టార్ దర్శకులు. మన తెలుగులో తీసుకుంటే ప్రెజెంట్ జెనరేషన్ లో సుకుమార్, రాజమౌళి త్రివిక్రమ్ లు సీనియర్ అండ్ టాప్ స్టార్ దర్శకులు లిస్ట్ లో కనిపిస్తే వారిలో సుకుమార్, రాజమౌళి లు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా దగ్గర పాగా వేసేసారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా రీజనల్ గానే సినిమాలు చేస్తుండగా తన నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

trivikram Srinivas penned pan India project for allu arjun which is bigger than kalki 2898 AD

కాగా ఇందుకు త్రివిక్రమ్ కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ సెట్ చేసుకున్న సినిమాల్లో ఓ సినిమాని అయితే ట్రూ పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తాను ప్లాన్ చేస్తున్నారట. షాకింగ్ గా ఈ సినిమా ఒక ఊహించని స్కేల్ లో తెరకెక్కిస్తారని అల్లు కాంపౌండ్ నుంచి ఇప్పుడు సమాచారం. కాగా ఈ భారీ చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్రస్తుత కల్కి 2898 ఎడి స్కేల్ ని మించి గురూజీ ప్లాన్ చేస్తున్నారట.

అలాగే ఇది కూడా పీరియాడిక్ నేపథ్యంలో ఉండొచ్చని టాక్. అయితే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ భారీ ప్రాజెక్ట్ ని అనుకున్నట్టుగా టాక్ వచ్చింది. మరి ఆ సినిమానే ఈ సినిమానా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 తర్వాత పుష్ప 3 కి గ్యాప్ తీసుకోనున్నాడు. ఈ తర్వాతనే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అన్నటుగా నయా గాసిప్స్. మరి ఈ సెన్సేషనల్ కలయికలో ఆల్రెడీ హ్యాట్రిక్ భారీ హిట్స్ టాలీవుడ్ లో ఉన్నాయి.

trivikram Srinivas penned pan India project for allu arjun which is bigger than kalki 2898 AD

మరి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నుంచి పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే మినిమమ్ ఆశించవచ్చు. కానీ వీరు ఏం ప్లాన్ చేస్తున్నారో అనేది వేచి చూడాల్సిందే. కాగా మరో పక్క అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ మరింత ఆలస్యం అవుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి ఈ సినిమాని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇది డిసెంబర్ 6న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుండగా బెంగాల్ భాషలో రిలీజ్ కానున్న మొదటి సౌత్ సినిమాగా పుష్ప 2 ది రూల్ వెళ్లబోతుంది

More from Filmibeat

Read more about: allu arjun trivikram jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X