అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ భారీ స్కెచ్.. చిరంజీవితో లింక్! మెగా అభిమానులకు పండగే..

Recommended Video

Ala Vaikuntapuramlo Teaser Update || మెగా అభిమానులకు పండగే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా అభిమానులకు కనువిందు చేసేలా భారీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆయన వేసిన ఈ స్కెచ్ అల్లు అర్జున్ కోసమే ప్రత్యేకం అంటున్నారు. ఈ మేరకు ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేశారని విశ్వనీయ వర్గాల సమాచారం. పైగా ఈ ప్లాన్ అమలైందంటే మెగా అభిమానులకు పండగే అని కూడా తెలుస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్? వివరాల్లోకి పొతే..

అసలు టాస్క్ అంటే ఇదీ..

అసలు టాస్క్ అంటే ఇదీ..

ఈ రోజుల్లో ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే ఎన్నోదారులు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ విస్తృతం కావడం, సినిమాలు దానికి సంబందించిన విషయాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం మూలంగా ప్రమోషన్స్ సులువయ్యాయని చెప్పుకొవచ్చు. కాకపోతే విడుదలకు ముందు చేసే ఈ ప్రమోషన్స్ కోసం డిఫెరెంట్ కోణంలో ఆలోచించడం, దాన్ని అమలు చేయడమే అసలు టాస్క్. సరిగ్గా ఇదే టాస్క్ కోసం సూపర్ స్కెచ్ వేశారట త్రివిక్రమ్.

అల్లు అర్జున్ కోసమే ప్రత్యేకంగా

అల్లు అర్జున్ కోసమే ప్రత్యేకంగా

'నా పేరు సూర్య' డిసాస్టర్ తో అల్లు అర్జున్ కెరీర్ కాస్త స్లో అయింది. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా తనదైన స్టైల్ స్క్రిప్ట్ రెడీ చేసి 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్. పైగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ విషయమై భారీ ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజాగా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' ద్వారా హైప్ తీసుకురావాలని స్కెచ్ వేశాడట త్రివిక్రమ్.

'సైరా నరసింహా రెడ్డి'తో 'అల.. వైకుంఠపురములో' లింక్

'సైరా నరసింహా రెడ్డి'తో 'అల.. వైకుంఠపురములో' లింక్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దీంతో దానిని తమ సినిమాకు అనుకూలంగా మార్చుకునేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అల్లు అర్జున్‌ హీరోగా రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' టీజర్‌ని 'సైరా' ప్రదర్శించబడే అన్ని థియేటర్స్‌లో షో చేయాలని నిర్ణయించాడట మాటల మాంత్రికుడు.

అందుకే ముందుకు జరిపారా..?

అందుకే ముందుకు జరిపారా..?

నిజానికి 'అల.. వైకుంఠపురములో' టీజర్‌ని త్రివిక్రమ్ బర్త్ డే రోజు కానుకగా నవంబర్ 7 న విడుదల చేయాలనుకున్నారు. కానీ దాన్ని కాస్త ముందుకు జరిపి అక్టోబర్ మొదటి వారంలో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే 'సైరా నరసింహా రెడ్డి' ద్వారా అల్లు అర్జున్ సినిమాకు హైప్ తెచ్చేందుకే టీజర్ విడుదలను ఇలా ముందుకు జరిపారని తెలుస్తోంది కదూ!.

అల.. వైకుంఠపురములో మూవీ

అల.. వైకుంఠపురములో మూవీ

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో 'అల.. వైకుంఠపురములో' మూవీ తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X