Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా మూవీ.. బాక్సాఫీస్ కాంబో!
ఇప్పుడున్న అగ్ర దర్శకుల్లో దాదాపు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అటువైపు వెళ్ళని పూరి జగన్నాథ్ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కంటిన్యూగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. సుకుమార్ కూడా ఆల్రెడీ సక్సెస్ కొట్టేసాడు. ఇక బోయపాటి కూడా రెడీ అవుతున్నాడు. అయితే మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఒక స్టార్ హీరోతో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ హిట్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో సరికొత్త మాటలతో పవర్ ఫుల్ డైలాగ్స్ తో కామెడీ పంచులతో కమర్షియల్ గా సినిమాను వెండితెర పైకి తీసుకువస్తూ ఉంటాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయాలి అని చాలామంది హీరోలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అజ్ఞాతవాసి సినిమాతో భారీగా దెబ్బతిన్నప్పటికీ కూడా ఆ తర్వాత అరవింద సమేత, అల.. వైకుంఠపురములో సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.

సెన్సేషన్ కాంబో
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోకస్ మొత్తం కూడా మహేష్ బాబు సినిమా పైనే ఉంది. మహేష్ బాబు తో చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంతకుముందు వీరి కలయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మూడవసారి మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది

త్రివిక్రమ్ కూడా అదే ఆలోచనలో..
అసలైతే మహేష్ బాబు కంటే ముందు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను RRR సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత కూడా ఫ్యాన్ ఇండియా సినిమా చేయాలి అని త్రివిక్రమ్ లోకల్ సినిమాను పక్కన పెట్టేసాడు. అయినప్పటికీ అప్పుడు త్రివిక్రమ్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ స్టార్ హీరోలు కూడా మార్కెట్ కు తగ్గట్టుగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఉండడంతో త్రివిక్రమ్ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ పాన్ ఇండియా?
త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అనంతరం ఎవరితో చేస్తారని విషయంలో ఇంకా ఫైనల్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా క్యాన్సిల్ అనుకున్న ప్రాజెక్టు మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఫ్యాన్ ఇండియా సినిమా కూడా చేయాలి అని ఒక హీరో త్రివిక్రమ్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. అతను మరెవరో కాదు అల్లు అర్జున్ అని తెలుస్తోంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పుష్ప అనంతరమే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశం ఉంటుందని టాక్.