మొదటిసారి త్రివిక్రమ్ పొలిటికల్ టచ్.. జూనియర్ ఎన్టీఆర్‌తో సరికొత్త ప్రయోగం

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది. తెలుగులో ఇప్పుడున్న బెస్ట్ దర్శకుల టాపిక్ వస్తే ఆయన పేరు ముందుంటుంది. అయితే రాజమౌళితో పాటు మిగతా దర్శకులు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తుంటే ఆయన మాత్రం ఇంకా టాలీవుడ్ సర్కిల్ లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలను యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ జనర్ లోనే రెడీ చేస్తున్నారు.

రాజ్ కుమార్ హిరాని రేంజ్ లో.. పొగిడితే..

రాజ్ కుమార్ హిరాని రేంజ్ లో.. పొగిడితే..

త్రివిక్రమ్ తలచుకుంటే రాజ్ కుమార్ హిరాని రేంజ్ లో సినిమాలు చేయగలరని చాలా మంది ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో చెబుతుంటారు. కానీ ఆయన ఎందుకో మరి బార్డర్ దాటి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయితే ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా ఉండాలని ఒక కొత్త ప్లాన్ వేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.

 ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.

ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.

ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయినట్లు అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో ఎనౌన్స్ చేశారు. RRR అయిపోగానే త్రివిక్రమ్ షూటింగ్ పనులను కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ఆ విషయంపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు.

మళ్ళీ పాన్ ఇండియా అంటున్నారే..

మళ్ళీ పాన్ ఇండియా అంటున్నారే..

ఇక ఇటీవల రమ్యకృష్ణ, రావు రామేష్, అలాగే ఇతర బాలీవుడ్ సీనియర్ నటులను కొన్ని పొలిటికల్ పాత్రల కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. RRR తరువాత పాన్ ఇండియా ప్రాజెక్టు అయితేనే బెటర్ అని ఎన్టీఆర్ కోరడంతో మళ్ళీ ప్రాజెక్టులో మార్పులు చేసినట్లు రూమర్స్ అయితే వచ్చాయి. ఇక సినిమాలో పొలిటికల్ టచ్ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

 సరికొత్తగా పొలిటికల్ టచ్

సరికొత్తగా పొలిటికల్ టచ్

గతంలో లవ్, ఫ్యామిలీ, కామెడీ అలాగే యాక్షన్ డ్రామా కథలను ఎక్కువగా తెరకెక్కించిన త్రివిక్రమ్ పొలిటీకల్ సైడ్ అసలు వెళ్లలేదు. ఇక ఈ సారి మాత్రం కథ చాలా బలంగా ఉండేలా రాజకీయ కోణాల్లో స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ ఎండ్ అయ్యేవరకు కథ విషయంలో ఎంతో కీలకంగా ఉండే త్రివిక్రమ్ ఇప్పుడు వేసుకుంటున్న ప్రణాళికలు లీకవుతున్నట్టుకు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X