బన్నీ ప్రపోజల్‌ను తిరస్కరించిన త్రివిక్రమ్.. నిర్మాత జోక్యం చేసుకున్నా ఫలితం లేదట.!.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే..

వైకుంఠపురానికి అవే హైలైట్
రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్.

అన్నీ అదిరిపోయాయి
‘అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రచార చిత్రాలు, పాటలు, లుక్కులకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ‘సామజవరగమన' అనే పాట తెలుగులోనే అత్యధిక లైకులు సంపాదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే, ‘రాములో రాములా' సాంగ్ కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంది.

త్రివిక్రమ్‌కు బన్నీ ప్రపోజల్
నవంబర్ 7 (గురువారం) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ‘అల.. వైకుంఠపురములో' నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ వస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బన్నీ.. ఏదైనా ఓ లుక్కునో, పాటనో, టీజర్‌నో విడుదల చేయమని త్రివిక్రమ్ వద్ద ప్రపోజల్ పెట్టాడట.

తిరస్కరించిన మాటల మాంత్రికుడు
బన్నీ పెట్టిన ప్రపోజల్‌ను త్రివిక్రమ్ సున్నితంగా తిరస్కరించాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘ఇప్పటికే రెండు పాటలు, ఓ టీజర్‌ను విడుదల చేశాం కాబట్టి మిగిలినవి తర్వాత చేద్దాం' అని ఆయన వివరించాడట. ఇంతలో నిర్మాత రాధాకృష్ణ జోక్యం చేసుకున్నప్పటికీ త్రివిక్రమ్ ఒప్పుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘అల.. వైకుంఠపురములో' విషయానికొస్తే..
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











