SSMB 28: విలన్ విషయంలో త్రివిక్రమ్ బిగ్ సస్పెన్స్.. లిస్టులో పవర్ఫుల్ టాలెంటెడ్ నటులు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల అనంతరం మళ్ళీ వీరి కలయికలో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలకు మించి ఉంటుంది అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు విలన్ ఎవరు అనే విషయం లో కూడా గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక మహేష్ కోసం ఇటీవల కొంతమందికి పవర్ఫుల్ టాలెంటెడ్ నటులలో పేర్లను కూడా చర్చలోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

 రాజమౌళి చెప్పినట్లుగా..

రాజమౌళి చెప్పినట్లుగా..

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కథకు తగ్గట్టుగా పాత్రలను కూడా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. మంచి ఎమోషన్స్ పాత్రలను హైలెట్ చేయడం లో త్రివిక్రమ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. అతను కంప్లీట్ కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా చేయగలిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని గతంలో రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చాడు. అందుకోసమే మహేష్ బాబు కోసం అలాంటి కథతోనే త్రివిక్రమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అగ్రిమెంట్ పై సంతకం చేయలేదు

అగ్రిమెంట్ పై సంతకం చేయలేదు

అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా చేయడానికి అంత తొందరగా ఒప్పుకోలేదు. కథ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే వరకు కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ పై కూడా సంతకం చేయలేదు అని ఆ మధ్య కాలంలో ఒక టాక్ వినిపించింది. సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసినప్పటికీ కూడా మహేష్ బాబు ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టు పై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఇటీవల ఫైనల్ కథ నచ్చడంతో త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు.

 ప్రత్యేకమైన పాత్రలో

ప్రత్యేకమైన పాత్రలో


అయితే ఆ సినిమాలో మరో యువ హీరో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అల వైకుంఠపురములో సినిమాలో ఎలాగైతే అక్కినేని హీరో సుశాంత్ ను ఒక ప్రత్యేకమైన పాత్రలో హైలెట్ చేసాడో.. అదే తరహాలో ఇప్పుడు మహేష్ బాబు కోసం కూడా ఒక యువ హీరోను వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.

తారకరత్న క్లారిటీ

తారకరత్న క్లారిటీ

అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అయితే ఆ విలన్ పాత్ర కోసం ఇటీవల నందమూరి నటుడు తారకరత్నను సంప్రదించినట్లు గా కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అఫీషియల్ గా ఒక క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
వారి పేర్లు వైరల్

వారి పేర్లు వైరల్

ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల మహేష్ బాబుతో విలన్ క్యారెక్టర్ పై చర్చలు జరుపుతూ కొంతమంది నటీనటుల పేర్లను కూడా ప్రస్తావన లోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లను కూడా ప్రస్తావన లోకి తీసుకు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందట. మరి త్రివిక్రమ్ ఎవరిని విలన్ గా సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X