అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.!

By Manoj

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా దర్శకుల్లో ఒకరు. రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. ఎన్నో చిత్రాలకు కథ, సంభాషణలు అందించారు. పంచ్ డైలాగులకు చిరునామాగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా తన ప్రయణాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్.. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోలతో పని చేశారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిపోయారు. ఇక, తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ వార్త లీకైంది.

 ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలని

ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలని

గతంలో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్లను సైతం భారీగానే రాబట్టుకున్నాయి. వీటి తర్వాత ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ‘అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నారు. ఇది కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు.

గత చిత్రాల్లో చేసిందే ఇప్పుడు కూడా

గత చిత్రాల్లో చేసిందే ఇప్పుడు కూడా

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాటల మాంత్రికుడు అనే బిరుదు ఉంది. దీనికి కారణం ఆయన చేతి నుంచి పుట్టుకొచ్చిన డైలాగులే. వాస్తవానికి అదే ఆయన ప్రత్యేకత. అందుకే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో బలమైన కుటుంబ విలువలతో పాటు పంచ్ డైలాగులు ఉంటాయి. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నింటిలో ఇదే ఫాలో అయ్యారు. ఇప్పుడు బన్నీ సినిమాకూ ఇదే ప్రయత్నిస్తున్నారట.

అన్నీ అదిరిపోయాయి.. రికార్డులు క్రియేట్ చేశాయి

అన్నీ అదిరిపోయాయి.. రికార్డులు క్రియేట్ చేశాయి

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులోని ‘సామజవరగమన' అంటూ సాగే పాట దక్షిణాదిలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, ‘రాములో రాములా' సాంగ్ కూడా అదరగొట్టింది. ఇక, ఇటీవల విడుదలైన టీజర్ కూడా వ్యూస్ పరంగా దూసుకుపోయింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' కూడా బన్నీ మూవీతో పాటు సంక్రాంతికే విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ సరికొత్తగా చేస్తున్నారు. దీంతో మహేశ్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

ఇప్పటి వరకు ఏదైనా సినిమాకు సంబంధించి ఒక్కటే ఫంక్షన్ చేస్తున్నారు. అయితే, ‘అల.. వైకుంఠపురములో..'కు మాత్రం రెండు ఫంక్షన్స్ ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. అందులో ఒకటి మ్యూజికల్ నైట్ పేరిట హైదరాబాద్‌లో డిసెంబర్ 28న నిర్వహిస్తారట. అలాగే, జనవరి 5న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని సమాచారం. అంటే రెండు రాష్ట్రాల ప్రజలను కవర్ చేయబోతున్నారన్న మాట.

వైకుంఠపురములో ఎవరున్నారు.?

వైకుంఠపురములో ఎవరున్నారు.?

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే, అక్కినేని హీరో సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, మురళీ శర్మ, టబు, సముద్రఖని సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X