పాన్ ఇండియా ప్లాన్ లో త్రివిక్రమ్.. లిస్టులో ఆ బిగ్ హీరోలు.. ఫస్ట్ ఎవరితో అంటే..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇటీవల విడుదల కాగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది.
తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలి అని అటు మహేష్ బాబు తో పాటు ఇటు త్రివిక్రమ్ కూడా ఎంతో ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.

అయితే ఊహించని కారణాలతో ఈ సినిమా షూటింగ్ కు మధ్యమధ్యలో బ్రేకులు కూడా పడుతున్నాయి. ఇక త్రివిక్రమ్ ఇప్పటికే అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్స్ అందుకున్న దర్శకుడిగా కూడా గుర్తింపును అందుకున్నాడు. చిన్నదర్శకులే ఈ రోజులలో పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా త్రివిక్రమ్ మాత్రం ఇంకా అటువైపుగా అడుగులు వేయడం లేదు.
ఆయనతో సమానంగా ఉండే సుకుమార్ అలాగే రాజమౌళి కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ ఆ రేంజ్ లో ఎప్పుడు చేస్తాడు అనే సందేహాలకు త్వరలోనే సమాధానం దొరకబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా కథలు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అయితే అల్లు అర్జున్తో సినిమా చేస్తాడు అని ఆ మధ్య ఒక టాక్ వినిపించింది.

అలాగే లిస్టులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉండగా ఎన్టీఆర్ దేవర సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ హీరోల రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వెళుతున్న విషయం తెలిసిందే.
అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలను ఎవరితో మొదట మొదలుపెట్టిన కూడా అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందట. ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఫస్ట్ పాన్ ఇండియా చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ మొదటి ఫ్యాన్ ఇండియా సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











