twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ చేతిలో నాలుగు రేసు గుర్రాలు.. స్పీడ్ చూస్తుంటే రాజమౌళిని దాటేసెలా ఉన్నాడు!

    |

    లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నష్టపోయినప్పటికి స్టార్ హీరోలకు, దర్శకుల భవిష్యత్తుకు మాత్రమే బాగానే ఉపయోగపడింది. ఒక మంచి ప్లానింగ్ సెట్ చేసుకునే అవకాశం దొరకడంతో నెక్స్ట్ నాలుగేళ్ళ వరకు సరిపడే ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు కొందరు. ఇక త్రివిక్రమ్ ఆ విషయంలో కాస్త దుకుడుగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆయన ఒక 5కథలను ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Vakeel Saab Director Venu Sriram About Trivikram Srinivas
    చెప్పిన కథలనే అటు ఇటు తిప్పి..

    చెప్పిన కథలనే అటు ఇటు తిప్పి..

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కథల కొరత చాలానే ఉంది. చెప్పిన కథలనే అటు ఇటు తిప్పి స్క్రీన్ ప్లే మేకింగ్ తో జనాలను ఆకట్టుకుంటున్నారు. త్రివిక్రమ్ అందుకు కాస్త భిన్నంగా కేవలం చిన్న లైన్ ని తీసుకొని సినిమాను సరికొత్తగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ విధంగా చేసిన అల.. వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    రేసు గుర్రం లాంటి హీరోలు

    రేసు గుర్రం లాంటి హీరోలు


    ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో బాక్సాఫీస్ పోటీలో ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాసే రేసు గుర్రం లాంటి హీరోలు ఉన్నారు. చూస్తుంటే త్రివిక్రమ్ ఒక విధంగా రాజమౌళి కంటే స్పీడ్ గా దూసుకుపోయేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ కూడా ఇక నుంచి పాన్ ఇండియా బాట పట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది.

     RRR అయిపోగానే..

    RRR అయిపోగానే..


    అల.. వైకుంఠపురములో 200కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడంతో వీలైనంత వరకు నెక్స్ట్ సినిమాలను అన్నీబాషల్లో రిలీజ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR అయిపోగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు.

     రాజమౌళి కంటే హై రేంజ్ లో..

    రాజమౌళి కంటే హై రేంజ్ లో..

    ఇక ఆ తరువాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, ఇలా అగ్ర హీరోలు చాలా మందే ఉన్నారు. మాటల మంత్రికుడితో సినిమా అంటే రిజెక్ట్ అనే ఛాన్స్ లేదు. ఓకేవేళ త్రివిక్రమ్ గనక ఈ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలను తీస్తే ఎంతవరకు హిట్స్ అందుకుంటాడో తెలియదు గాని తప్పకుండా రాజమౌళి కంటే హై రేంజ్ లో తన ఆదాయాన్ని పెంచుకుంటాడాని చెప్పవచ్చు.

     మూడేళ్లలో నాలుగు సినిమాలు

    మూడేళ్లలో నాలుగు సినిమాలు


    ఎందుకంటే రాజమౌళి నుంచి ఒక సినిమా వచ్చేసరికి 2 నుంచి మూడేళ్ళ వరకు సమయం పడుతోంది. కానీ త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటే మూడేళ్లలో నాలుగు సినిమాలు రిలీజ్ చేయగలడు. ఆ లెక్కన చూస్తే రాజమౌళి, త్రివిక్రమ్ మార్కెట్ స్థాయిలలో ఏ మాత్రం తేడాలు కనిపించవు. ఇక బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ గా హిట్స్ పడితే త్రివిక్రమ్ ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

    English summary
    The heroes of the Tollywood industry are also ready to make negative rolls in the meantime. More often than not just a hero, a good actor. Soon Manchu's hero will also be seen as a powerful villain in the NTR movie. Information about Trivikram Tarak movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X