త్రివిక్రమ్ ఎదురు చూపులు.. ఎటూ తేల్చని మహేష్‌బాబు.. ఆ రోజునే అఫీషియల్‌గా
టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రహీరోలకు సంబంధించిన సినిమాల విషయంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎప్పుడూ సినిమా ప్రారంభమవుతుందనే ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గట్టి దెబ్బ పడింది. ఎన్టీఆర్‌కు గుడ్ బై చెప్పి త్రివిక్రమ్ మహేష్ బాబుతో జతకడుతున్నారనే విషయం సంచలనం రేపింది. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ విషయానికి వస్తే గతంలో అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆలరించాయి. భారీ హిట్ సాధించికపోయినా ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులు మంచి అనుభూతిని పంచాయి. ఇక మహేష్ విషయానికి వస్తే అతడు చిత్రం ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసింది. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయడానికి ఇద్దరు కసరత్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌తో మూవీ వెనక్కు...
ఈ క్రమంలో ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా టైటిల్ అయినను హస్తినకు పోయి రావలే అని ప్రచారం జరిగింది. కొద్ది రోజుల్లో పట్టాలెక్కుతుందని ఆశించిన సినీ వర్గాలు, అభిమానులకు గట్టి షాక్ తగిలింది. త్రివిక్రమ్‌తో కాకుండా కొరటాల శివతో ఎన్టీఆర్ జతకట్టడం సంచలనంగా మారింది.

కొరటాలతో ఎన్టీఆర్ జతకట్టి
త్రివిక్రమ్ చెప్పిన కథకు ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పారు. దానికి సంబంధించిన మార్పులు చేర్పుల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు చోటుచేసుకొన్నాయి. ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే కారణంతో కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ సినిమా తీయాలని నిర్ణయం తీసుకొన్నారు అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

మహేష్ బాబు నిర్ణయం కోసం
ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్ నేరేషన్ త్రివిక్రమ్ ఇవ్వాల్సి ఉంది. ఇంకా మహేష్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్రివిక్రమ్ స్ట్రిప్టు ఫైనల్ అయిన తర్వాత మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారనేది తాజా సమాచారం.
Recommended Video

మే 31న పట్టాలెక్కే Mahesh28
త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించి అంతా సవ్యంగా సాగితే త్వరలోనే Mahesh28 పట్టాలెక్కే అవకాశం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున అంటే మే 31 తేదీని ఈ సినిమాకు ముహుర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు.


Click it and Unblock the Notifications











