twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్.. ఇప్పట్లో ఉండకపోవచ్చు!

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలందరికీ కావలసిన దర్శకుడు. త్రివిక్రమ్ చిత్రాలు మిగిలిన దర్శకుల కంటే విభిన్నంగా ఉంటూ హీరోల ఇమేజ్ పెంచే విధంగా ఉంటాయి. తాజాగా అరవింద సమేత చిత్రంలో త్రివిక్రమ్ సూపర్ హిట్ అందుకున్నాడు. అరవింద సమేత చిత్రం పూర్తయినప్పటి నుంచి త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఏంటనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విక్టరీ వెంకటేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా జరుగుతున్న ప్రచారం వెంకీ అభిమానులని నిరాశ కలిగించేదే.

    చాలా రోజుల క్రితం ప్రకటన

    చాలా రోజుల క్రితం ప్రకటన

    త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందంటూ హారిక హాసిని సంస్థ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. దీనితో వెంకటేష్ అభిమానులు సంబరపడిపోయారు. 2001 లో విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోయారు.

     వెంకటేష్, త్రివిక్రమ్ మార్క్

    వెంకటేష్, త్రివిక్రమ్ మార్క్

    నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి దర్శకుడు విజయ్ భాస్కరే అయినప్పటికీ.. ఆ సినిమా మొత్తం వెంకటేష్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్ తో వినోదాత్మకంగా సాగుతుంది. త్రివిక్రమ్, వెంకీ కాంబినేషన్ లో సినిమావస్తే అలాంటి వినోదాత్మక చిత్రం వస్తుందని అభిమానులు భావించారు.

    అల్లు అర్జున్‌తో సినిమా

    అల్లు అర్జున్‌తో సినిమా

    త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ హిందీ చిత్ర కథ ఆధారంగా త్రివిక్రమ్, బన్నీ సినిమా రోపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకీ కూడా ప్రస్తుతం ఎఫ్2, వెంకీ మామ వంటి మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు.

    వెంకీ బర్త్ డే సందర్భంగా

    వెంకీ బర్త్ డే సందర్భంగా

    వెంకటేష్ గతః పుట్టిన రోజు సందర్భంగా హారిక అండ్ హాసిని సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. వెంకటేష్ తదుపరి చిత్రం తమ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శత్వంలో ఉండబోతున్నట్లు తెలిపింది. కానీ తాజాగా సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆ చిత్రం రద్దయిందని అంటున్నారు. భవిషత్తులో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తప్పకుండా సినిమా ఉంటుందని అంటున్నారు.

    English summary
    Trivikram, Venkatesh movie cancelled. Production house harika and hasini wants to produce this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X