త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య నృత్య ప్రదర్శన
ప్రముఖ రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి మిసెస్ సౌజన్య క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె నృత్య ప్రదర్శన ఈ నెల(జనవరి) ఇరవై మూడున తేదీన రవీంధ్ర భారతిలో ఉంది. ఆమె కూచపూడి డాన్స్ లో ఎక్సపెర్ట్. అలాగే ఈ ప్రదర్శన అందరికీ కాకుండా ఎక్సక్లూజివ్ గా కొందరికి మాత్రమే నని తెలుస్తోంది. ఇక వివాహానికి ముందు అనంతరం త్రివిక్రమ్ ఆమెను ఈ కళ వైపు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వివాహనికి కారణం ఈ నృత్యంలో ఆమె ప్రవీణురాలవటం కూడా కారణమని చెప్తూంటారు. ఎందుకంటే మొదటి నుంచీ త్రివిక్రమ్ కి కళలలంటే విపరీతమైన ఆసక్తి, అనురక్తి కారణం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తన లేటెస్ట్ ప్రాజెక్టు మహేష్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు గా ఎదురు చూస్తున్నారు. అతిది అనంతరం మహేష్ ఏ చిత్రం కమిట్ కాకుండా దీనికై తన డేట్స్ ని కేటాయించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు వంటి సూపర్ హిట్ రావటమే దీనికి కారణం. ఇవన్నీ ప్రక్కన పెడితే మిసెస్ సౌజన్యా శ్రీనివాస్ కూచిపూడి ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications