God of War: ఎన్టీఆర్ అవుట్.. అల్లు అర్జున్ ఇన్.. త్రివిక్రమ్ న్యూ ప్లాన్ ఇదేనా?
Trivikram's God of War Project: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas) ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే, ఈ ఫ్యామిలీ డ్రామా కంటే ముందే, త్రివిక్రమ్ లైనప్‌లో ఉండాల్సిన ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ భారీ ప్రాజెక్ట్ ఎంటీ? ఆ స్టార్ హీరోతో సినిమా తీయబోతున్నారు? అనే విషయాలు మీ కోసం..
మైథాలజికల్ ఫాంటసీ
త్రివిక్రమ్ చాలా కాలంగా ఒక భారీ మైథాలజికల్ ఫాంటసీ స్టోరీ ఆధారంగా సినిమా తీయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధ దేవుడు కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ సినిమాను 'గాడ్ ఆఫ్ వార్' వర్కింగ్ టైటిల్‌తో ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో అనౌన్స్ చేయాలని భావించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన రూమర్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే 'పుష్ప 2' సినిమాలో బన్నీ బిజీబిజీగా మారడం, ఆ తర్వాత అట్లీతో బన్నీ కమిట్ అయిన భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది.

లైన్‌లోకి ఎన్టీఆర్
బన్నీ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, త్రివిక్రమ్ ఈ కథను జూనియర్ (Jr NTR) కు నరేట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. నిర్మాత నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ రామాయణం కంటే పెద్ద స్కేల్‌లో ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో హైప్ పెరిగింది. అంతేకాదు, ఎన్టీఆర్ 'మురుగా: ది లార్డ్ ఆఫ్ వార్' వంటి పుస్తకాలు చదువుతున్న ఫొటోలు బయటకు రావడంతో తారక్-త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అనుకున్నారంతా.
అసలు ట్విస్ట్ ఇదే..
ఇప్పుడే మరోసారి ట్విస్ట్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ మళ్లీ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ చిత్రంతో బిజీగా ఉండటంతో, ఈ మైథాలజికల్ మూవీ కోసం డేట్స్ కష్టమయ్యాయని సమాచారం. దీంతో ఈ కథ మళ్లీ అల్లు అర్జున్ కాంపౌండ్‌కి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్-బన్నీ కాంబో వేరే లెవల్
ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాంటి జోడీ మైథాలజికల్, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ ఇమేజ్, త్రివిక్రమ్ డైలాగ్స్, గ్రాండ్ విజువల్స్ అన్ని కలిసి ఓ విజువల్ వండర్‌గా ఈ సినిమా నిలవబోతోందని టాక్.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న AA22 ప్రాజెక్ట్ (సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్) 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా పూర్తయ్యాకే 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్‌పైకి వెళ్లనుందని, 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్‌పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో బన్నీనా? ఎన్టీఆర్‌నా? అన్న ప్రశ్నకు అధికారిక సమాధానం లేదు. ప్రాజెక్ట్ అటూ ఇటూ చేతులు మారుతున్న నేపథ్యంలో, ఎవరు హీరోగా ఫిక్స్ అయినా మరో హీరో అభిమానులు హర్ట్ అయ్యే అవకాశముంది. అందుకే మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి చివరికి త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'లో యుద్ధ దేవుడిగా ఎవరు కనిపించబోతున్నారు? అన్నది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











