twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఇలా కామెంట్ చేశాడేంటి..? జక్కన్న తీరుపై హాట్ హాట్ చర్చలు!

    |

    Recommended Video

    SS Rajamouli Comments On Lord Rama & Lord Krishna || రాజమౌళి విచిత్ర కామెంట్స్

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను ఇటీవలే లండన్ లోని ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా లండన్ వెళ్లి బాహుబలి ప్రదర్శన చూసిన ఆయన మీడియాతో ముచ్చటించడం, ఆ సందర్భంలో రాముడు, కృష్ణుడు గురించి మాట్లాడటం పలు చర్చలకు దారి తీస్తోంది. జక్కన్న మాట్లాడిన తీరుపై మండిపడుతున్నాయి హిందూ వర్గాలు. ఆ వివరాలు చూద్దామా..

    వివాదాలకు దూరం.. రాజమౌళి నైజం

    వివాదాలకు దూరం.. రాజమౌళి నైజం

    దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించారు కానీ, ఎప్పుడూ వివాదాలకు పోయిన సందర్భాలు లేవనే చెప్పాలి. అదే రాజమౌళి నైజం. అయితే ఇప్పుడు మాత్రం ఆయన తీరును, మాట విధానాన్ని కొందరు తప్పుబడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

    శ్రీరాముడు శ్రీకృష్ణుడు మధ్య గల తేడా.. సినిమాలతో పోల్చుతూ

    శ్రీరాముడు శ్రీకృష్ణుడు మధ్య గల తేడా.. సినిమాలతో పోల్చుతూ

    తాను రూపొందించిన 'బాహుబలి' లోని అమరేంద్ర బాహుబలి పాత్రను శ్రీ రాముడితో పోల్చారు జక్కన్న. అమరేంద్ర బాహుబలి పాత్రలో అన్నీ శ్రీరాముడి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మధ్య గల తేడాలను సినిమాలతో పోలుస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇవి చూసి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.

    ఒకే భార్య.. బోరింగ్ అనేయడంతో

    ఒకే భార్య.. బోరింగ్ అనేయడంతో

    శ్రీకృష్ణుడు మన కమర్షియల్ చిత్రాలకు పక్కాగా సరిపోయే పాత్ర అని, అలాగే శ్రీరాముడి క్యారెక్టర్ మాత్రం బోరింగ్ అని అన్నారు. శ్రీ రాముడు ఓకే బ్యార్యతో ఉంటాడు, తండ్రి మాట జవదాటడు. ధర్మాన్ని పాటిస్తాడు అని శ్రీ రాముని గురించి చెప్పడం వరకు బాగానే ఉన్నా.. శ్రీరాముడి కథ కమర్షియల్ సినిమాలకు పనికిరాదని అనడం కొందరిలో ఆగ్రహం తెప్పిస్తోందట.

    రామాయణం రాసేడప్పుడు వాల్మీకి..

    రామాయణం రాసేడప్పుడు వాల్మీకి..

    శ్రీకృష్ణుడు పాత్ర అద్భుతంగా ఉంటుంది. 20 వేల మంది గోపికలతో రొమాన్స్, మాయ చేస్తాడు. కానీ శ్రీకృష్ణుడికి ఒక గుడి ఉంటే రాముడికి 50 గుళ్ళు ఉంటాయని చెబుతూ విచిత్రమైన కామెంట్స్ చేయడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రామాయణం రాసేడప్పుడు వాల్మీకి.. రాముడు పక్కన లక్ష్మణుడు, అంజనేయుడు లాంటి మాస్ పాత్రలు మాత్రం అద్భుతంగా రాశారని, రాముడి కోసం అనేక త్యాగాలు చేసిన ఆ పరాక్రమవంతుల పాత్రల స్పూర్తితో తాను కట్టప్ప పాత్రను డిజైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

    రాజమౌళి ఇలా లింక్ చేయడం సరికాదు

    రాజమౌళి ఇలా లింక్ చేయడం సరికాదు


    వాస్తవానికి శ్రీరాముడుని ఎవరైనా విమర్శిస్తే వెంటనే హిందువులలో తిరుగుబాటు వస్తుంది.. కానీ, అదే శ్రీకృషుడుని ఎవరైనా విమర్శిస్తే పెద్దగా పట్టించుకోరంటూ జక్కన్న చేసిన కామెంట్స్ కొందరిని అసహనానికి గురి చేశాయని తెలుస్తోంది. పురాణాలను కమర్షియల్ సినిమాలకు రాజమౌళి లింక్ చేయడం సరికాదంటూ కొందరు మండి పడుతున్నట్లు టాక్.

    RRR మూవీ..

    RRR మూవీ..

    ఇకపోతే బాహుబలి తర్వాత రాజమౌళి RRR సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చారిత్రాక నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది జులై 31న RRR మూవీ విడుదల కానుంది.

    English summary
    Rajamouli tweeted as Very excited that our film Baahubali-The Beginning is the first non-English film to have its score performed live at the world famous RoyalAlbertHall by the Royal Philharmonic Orchestra in London on Oct 19th. After this event Rajamouli talk with media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X