twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయభానుతో కారులో దొరికిన స్టార్ దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : యాంకర్,ఐటం గర్ల్ అంటూ దూసుకుపోతున్న ఉదయభాను పై ఓ న్యూస్ ఓ పాపులర్ తెలుగు న్యూస్ ఛానెల్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె,పూల రంగడు దర్శకుడు వీరభద్రం కలిసి కొంత కాలంగా తిరుగుతున్నారని ఆ న్యూస్ సారాంసం. ఇద్దరూ ఔటర్ రింగ్ రోడ్డులో సరదాగా ఓ ట్రిప్ వేసి వస్తూ కారు ప్లాబ్లం రావటంతో ఈ విషయం బయిటకి పొక్కిందని ఆ న్యూస్ ఛానెల్ చెప్పుకొచ్చింది. కారు ఆగిపోవటంతో వీరభద్రం దిగి లిఫ్ట్ కోసం చేతులు ఊపుతున్నారుట. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ సినిమా యూనిట్ వెహికల్ వాళ్లు చూసి ఆపారు. అప్పుడు ఆయన కారు డోర్ తీసారు. చూస్తే లోపల ఉదయభాను ఉంది. ఈ వార్తలో ఎంత నిజముందో కానీ ఈ విషయం సిని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ప్రస్తుతం వీరభద్రం నాగార్జున హీరోగా నటించనున్న 'భాయ్' చిత్రం స్క్రిప్టు వర్క్ లో ఉన్నారు. డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర దర్శకుడు వీరభధ్ర చౌదరి తెలిపారు. 'అహనా పెళ్లంట','పూల రంగడు' చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న వీరభద్రమ్ ఈ చిత్రంపై పూర్తి విశ్వాసంగా ఉన్నారు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించచున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    English summary
    
 TV Anchor Uday Bhanu was caught with Poola Rangadu Director Veera Badram at Hyderabad Ring Road. There was no other information available about this catch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X