జూ. ఎన్టీఆర్‌పై చానెల్ డైరెక్ట్ అటాక్: ఫ్యాన్స్ గరం

By Pratap

హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఓ తెలుగు టీవీ చానెల్ నేరుగా దాడి చేస్తూ ప్రసారం చేసిన వార్తాకథనంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పిల్లకాకి అంటూ ఆ చానెల్ జూనియర్ ఎన్టీఆర్‌పై వ్యాఖ్యానించింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ పర్యటన చేసిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో బాలయ్యకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తాకథనాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యపై పోరు చేయడానికి సిద్ధపడినట్లు కూడా మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఓ తెలుగు టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్‌పై ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్‌తో పోల్చుకుంటున్నాడని అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదని వ్యాఖ్యానించింది. ఓ రకంగా నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌పై దాడి చేసినట్లు ఆ వార్తాకథనం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఆ వార్తాకథనంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుతకుత ఉడిపోతున్నట్లు చెబుతున్నారు. మాస్ ఇమేజ్‌తో ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్న తమ హీరోను చానెల్ పిల్లకాకి అంటూ అభివర్ణించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటే ఆ పార్టీకి కష్టాలు తప్పవని అంటున్నారు.

బాద్‌షా చిత్రం విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పిల్ల కాకో, పిల్ల పులియో తెలిసి వస్తుందని ఆయన అభిమానులు అంటున్నారని సమాచారం. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన పెద్ద దుమారాన్నే రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X