TVK Vijay: దళపతి విజయ్ ఇంటి కూల్చివేత? కౌంటింగ్‌కు ముందు ఊహించని ట్విస్ట్

తమిళనాడు ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. డీఎంకే మరోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తుండగా.. ఈసారైనా పవర్ చేజిక్కించుకోవాలని అన్నాడీఎంకేలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఇక కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన పోలింగ్ అంచనాలను మరింత పెంచేసింది.

తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ .. మహిళలను, యువతను పెద్ద ఎత్తున ప్రభావితం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల లోపు యువత ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తడం విజయ్ మార్క్‌గా చెబుతున్నారు. అదే నిజమైతే ద్రవిడ పార్టీల పునాదులు కదిలించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ఎన్నికల్ల అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించేది మహిళలే. గతంలో ఎంజీఆర్, జయలలితలకు వీరు పట్టం కట్టారు. ఇక విజయ్‌కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఆ వర్గం ఓట్లు దళపతి వైపే మొగ్గు చూపినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. భారీ ఓటింగ్‌, ప్రజల్లో మార్పు నేపథ్యంలో విజయ్‌కి ఖచ్చితంగా చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగే ఆయన కింగ్ మేకర్‌గా అవతరిస్తారని భావిస్తున్నారు.

TVK Vijay s Saligramam House set to Demolition Ahead Tamil Nadu Election Results

అటు పోలింగ్‌పై దళపతి విజయ్, టీవీకే శ్రేణులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమను తక్కువగా అంచనా వేసిన వారికి ప్రజలే సమాధానం చెప్పారు. రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్న వారికి, పదవుల్లో ఉన్న వారికే పరిమితం అనే భావనను ప్రజలు చిత్తు చేశారు. మహిళలు, యువత ఈసారి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం తమిళనాడులో చారిత్రాత్మక మార్పుకు నిదర్శనం. దేశ విదేశాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ధన్యవాదాలు. ఏజెంట్లు, పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని విజయ్ పేర్కొన్నారు.

టీవీకే విజయ్‌తో పాటు డీఎంకే, అన్నాడీఎంకే అన్ని వర్గాలు మే 4న వెలువడనున్న తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఫలితాలు వెలువడక ముందే విజయ్ నివాసం కూల్చివేతకు ఏర్పాట్లు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం విజయ్ .. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న తన నివాసంలో ఉంటున్నారు. టీవీకే కార్యాలయం చెన్నైలోని తిరువాన్మియూర్ ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలో విజయ్ తొలినాళ్లలో నివసించిన చెన్నైలోని సాలిగ్రామం ఇంటిని కూల్చివేయాలని ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భవనాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో భారీ అపార్ట్‌మెంట్ నిర్మించాలని భావిస్తున్నారట.

ఈ సాలిగ్రామం నివాసంలో ఎస్ఏ చంద్రశేఖర్ ఆఫీసు.. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోనీ స్టూడియోలు ఉండేవి. అయితే ఆంటోనీ ఇప్పటికే ఆ చోటుని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఈ ఇంట్లో ప్రతిరోజూ మధ్యాహ్నం సుమారు 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ ఇంటిని కూల్చివేస్తే ఈ కార్యక్రమం నిలిచిపోతుంది. ఒకవేళ విజయ్ కనుక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే.. తన పాత ఇంటిని ఒక స్మారక చిహ్మంగా మార్చాలని అనుకున్నారు. అయితే ఈ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వీలైనంత త్వరలోనే కూల్చివేత పనులు ప్రారంభించాలని చంద్రశేఖర్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: thalapathy vijay tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X