Radhe Shyam Release Twist..సంక్రాంతి రేసులో ఉంటుందా? లేదా? ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగడం సినిమా పరిశ్రమను మరోసారి సందిగ్ధంలో పడేసింది. గతంలో విధించిన రెండు లాక్‌డౌన్ల కారణంగా పలువురు అగ్రహీరోలు, భారీ బడ్జెట్ ప్రాజెక్టుల రిలీజ్ నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే సంక్రాంతి 2022‌ పలు సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకోగా.. మరోసారి ఒమిక్రాన్ రూపంలో కరోనావైరస్ భూతం విలయతాండవం చేస్తున్నది. దీంతో పలు సినిమాల రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. అయితే రాధేశ్యామ్ రిలీజ్ విషయంలో కొనసాగుతున్న ఊగిసలాటకు నిర్మాతలు ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏమిటంటే..

Recommended Video

RRR : Sankranthi కి Bheemla Nayak, Radhe Shyam సినిమాలు లేనట్టేనా ?
 కరోనావైరస్ విజృంభణతో

కరోనావైరస్ విజృంభణతో

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా యూఎస్, యూకే దేశాల్లో కూడా భారీగా నమోదు అయ్యాయి. అమెరికాలో ఇటీవల కాలంలో ఒక్క రోజే 5.5 లక్షల కేసులు రావడంతో పలు థియేటర్లను మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో ప్యాన్ ఇండియా సినిమాలకు షాక్ తగిలింది.

 RRR వాయిదా నేపథ్యంలో

RRR వాయిదా నేపథ్యంలో

టాలీవుడ్‌లో రెండేళ్లుగా వాయిదా పడుతున్న RRR, రాధేశ్యామ్ చిత్రాలు సంక్రాంతి 2022 బరిలోకి దిగాయి. జనవరి 7వ తేదీన RRR చిత్రం, జనవరి 14వ తేదీన రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ కేసులు పెరగడంతో తాము సంక్రాంతికి RRR సినిమాను రిలీజ్ చేయడం లేదని ఎస్ఎస్ రాజమౌళి టీమ్ ప్రకటన చేశారు. దాంతో అభిమానులు నిరాశ చెందారు.

ఓటీటీ రూమర్లకు తెర వేసే విధంగా

ఓటీటీ రూమర్లకు తెర వేసే విధంగా

అయితే రాధేశ్యామ్ చిత్రం రిలీజ్‌పై అనేక రకాల ఊహగానాలు మీడియాలో కనిపించాయి. సంక్రాంతికి రాధేశ్యామ్ రావడం లేదు. ఏప్రిల్ లేదా జూన్‌లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే రూమర్లు మీడియాలో క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా ఓటీటీ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు కూడా జోరుగా షికారు చేశాయి. అయితే రాధేశ్యామ్ రిలీజ్‌పై వస్తున్న రూమర్లకు యూవీ క్రియేషన్స్ అడ్డుతెర వేశారు.

జనవరి 14న రిలీజ్?

జనవరి 14న రిలీజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ రాధేశ్యామ్ ముందుగా నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతన్నది. గతంలో నిర్ణయించినట్టుగానే జనవరి 14వ తేదీనే రాధేశ్యామ్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ వర్గాలు చెప్పినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. నిర్మాతలు స్పందించి అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప.. ఈ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 400 కోట్ల బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా

400 కోట్ల బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా

ప్రభాస్, పూజా హెగ్గే జంటగా నటించిన చిత్రాన్ని సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే కోవిడ్ కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.

నటీనటులు

నటీనటులు

ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కృష్ణం రాజు, సత్యరాజ్, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, ఫ్లోరా జాకోబ్ తదితరులు
రచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్ థమన్
హిందీలో మ్యూజిక్: మిథున్, అమల్ మాలిక్, మనన్ భరద్వాజ్
రిలీజ్ డేట్: 2022-01-14

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X