జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల సుడి మార్చగల అదృష్ట దేవతలు....
బ్రహ్మచర్యం నుండి గృహస్థంలోకి అడుగు పెట్టబోతున్న యువకెరటాలు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు ముందు పెద్ద సవాలే ఉంది. దాదాపుగా మరో రెండు, మూడు నెలల్లో ఇద్దరూ ఓ ఇంటి వారు అయిపోతారు కాబట్టి అదృష్టలక్ష్మిలైన లక్ష్మి ప్రణతి, స్నేహా రెడ్డిలు ఎంత వరకు వీరి సుడి మార్చగలుగుతారన్నదే టాక్. బన్నీకైతే గత నాలుగైదు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడితే..జూ ఎన్టీఆర్ అన్నీ యావరేజ్ సినిమాలతోనే బండి లాక్కొస్తున్నాడు తప్ప 'ఆది", 'సింహాద్రి" లాంటి హిట్టు చూసి ఏళ్లు గడిచాయి.
అటువంటి ఈ సమయంలో జూ ఎన్టీఆర్ 'శక్తి" మరియు బన్నీల బద్రీనాథ్" రిలీజుకు సిద్దమవ్వటంతో బన్నీ, ఎన్టీఆర్ లతో పాటు స్నేహా, లక్ష్మీల అదృష్టాన్ని కూడా పరీక్షిస్తుందంటున్నారు అభిమానులు. పెళ్లైతే అదృష్టం మారుతుందని నమ్మే చాలా మంది అభిమానుల్లో ఇప్పుడు ఈ రెండు చిత్రాల గురించి ఆ ఇద్దరి గురించే డిష్కషన్. భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణ దశల్లో ఉన్న ఈ రెండు చిత్రాలు, అర్థాంగులనే నమ్ముకున్న ఆ ఇద్దరు హీరోలకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











