పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఒకేరోజు ఆ రెండు సినిమాల స్పెషల్ అప్డేట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయాల కారణంగా వెండితెరకు దూరంగా ఉన్న పవర్ స్టార్ మొత్తానికి మూడు సినిమాలు చేయడానికి సిద్ధం కావడంతో అభిమానుల్లో ఒక జోష్ మొదలైంది. ఇక ఒకే రోజు రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని తెలుస్తోంది. ఒకటి టీజర్ కాగా మరొకటి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎనౌన్స్మెంట్.

వకీల్ సాబ్ కన్ఫ్యూజన్..
పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తవుతున్న సమయంలో డౌన్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఆ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత దిల్ రాజు కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఒక పాట ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయ్యింది.

టీజర్ డేట్ ఫిక్స్..
వకీల్ సాబ్ టీజర్ కోసం అభిమానులు ఎదురుచూపులకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడే విషయం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బిర్త్ డే సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ జోష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిల్ రాజు అదే రోజు టీజర్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ మరొక హిస్టారికల్ ఫిల్మ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

క్రిష్ సినిమా టైటిల్..
అయితే ఆ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సినిమా టైటిల్ పై ఇప్పటికే కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు క్రిష్ ముందుగా వీరుపాక్ష అని వర్కింగ్ టైటిల్ గా సెట్ చేసుకున్న విషయం తెగేలిసిందే. కానీ ఇంకా దాన్ని ఫైనల్ చేయలేదు.
Recommended Video

అదే రోజు మరో అప్డేట్..
గజదొంగ అనే టైటిల్ వైపే దర్శకుడు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడని పవన్ కళ్యాణ్ కూడా అదే టైటిల్ సజెస్ట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డేకి సోషల్ మీడియాలో సినిమా టైటిల్ ఈజీగా వైరల్ అవుతుంది కాబట్టి అదే రోజు ఎనౌన్స్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి సెప్టెంబర్ 2న ఆ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఏదైనా ఇస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











