నాగచైతన్య చిత్రానికి రెండు క్లైమాక్స్ లు!?
నాగచైత్యన, సమంత కాంబినేషన్ లో గౌతం మీనన్ రూపొందించిన 'ఏమాయ చేసావే' చిత్రానికి రెండు క్లైమాక్స్ లు రెడీ చేసినట్లు సమాచారం. ఇందులో ఒక క్లైమాక్స్ విషాదాంతం కాగా, మరొకటి సుఖాంతం అని చెప్తున్నారు. ఇందులో ఏ క్లైమాక్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ప్రస్తుతానికి తర్జన భర్జనలు పడుతున్నారు. విషాదాంతం అని ఫిక్సయ్యే నాగార్జున ఈ చిత్రాన్ని తన గీతాంజలి చిత్రంతో పోల్చాడంటున్నారు. ఇక ఏ క్లైమాక్స్ ఉంటుందనేది సినిమా రిలీజ్ తర్వాతే తేలుతుంది. రెండు రోజుల పాటు బయిట టాక్ పరిశీలించి అవసరమైతేనే రెండో క్లైమాక్స్ కు గౌతమ్ మీనన్ ఓకే చేస్తారని చెప్తున్నారు. అప్పటికప్పుడు హడావిడిగా చుట్టేయటం కన్నా కాస్త ఖర్చు అనిపించినా ఇదే మంచి విధానం అని గౌతం మీనన్ పర్శనల్ గా ఫీల్ అవుతారట. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇదే రోజు తమిళ వెర్షన్ కూడా విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది.తమిళంలో కూడా గౌతం మీనన్ దర్శకత్వం వహించారు. 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శిలాంబరసన్ (శింభు), త్రిష జంటగా నటించారు.


Click it and Unblock the Notifications











