ముందే లీకైన రాజా సాబ్ స్టోరీ మిస్టరీ.. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ రోల్ ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో హాలీవుడ్ స్థాయికి ఎదిగే సత్తా ఉన్న వాళ్లు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఏకధాటిగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీలో నటిస్తున్నాడు. తాజాగా దీని నుంచి లీకైన క్రేజీ న్యూస్‌ను మీరే చూడండి!

కల్కితో కుమ్మేస్తున్న ప్రభాస్
గత ఏడాది వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇదే జోష్‌లో ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. అందుకు తగ్గట్లుగానే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇలా వారంలోనే రూ. 650 కోట్లు పైచిలుకు గ్రాస్‌తో రికార్డులు సాధించింది.

Two Ghost Role Highlight In Prabhas and Maruthi The Raja Saab Movie

రాజా సాబ్‌గా రాబోతున్నాడు
ప్రభాస్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా అతడు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

సీక్రెట్‌గా.. అంత పూర్తైంది
రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో హర్రర్ కామెడీతో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' సినిమాను సీక్రెట్‌గా మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Two Ghost Role Highlight In Prabhas and Maruthi The Raja Saab Movie

దెయ్యంగా బాలీవుడ్ స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ది రాజా సాబ్' సినిమా హర్రర్ కామెడీతో రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. హీరో తాత పాత్రను చేస్తున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో ఆ బడా హీరో దెయ్యంగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో సంజయ్ దత్ పాత్రపై అంచనాలు భారీగా నెలకొన్నాయని చెప్పాలి.

Two Ghost Role Highlight In Prabhas and Maruthi The Raja Saab Movie

మరో దెయ్యం ఉందంటూ
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి ఎన్నో రకాల అంశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో మరో దెయ్యం కూడా ఉంటుందని ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ కూడా దెయ్యంగా కనిపించబోతుందట. ఇది సినిమాలోనే పెద్ద ట్విస్ట్ అని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

More from Filmibeat

Read more about: the raja saab prabhas maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X