వెంకటేష్, నాగ చైతన్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఖరారు!
Recommended Video

హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ అతడి మామయ్యగా కామియో రోల్ చేశాడు. ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవడం అభిమానులను ఖుషీ చేస్తోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సరసన ఈ హీరోయిన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన సంగతి తెలిసేందే. మరోసారి వీరిద్దరూ నటిస్తుండడం విశేషం.

ప్రేమమ్ సినిమాలో వెంకటేష్
నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ అతడి మామయ్యగా కామియో రోల్ చేశాడు. ఇప్పుడు తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవడం అభిమానులను ఖుషీ చేస్తోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో
ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సరసన ఈ హీరోయిన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన సంగతి తెలిసేందే. మరోసారి వీరిద్దరూ నటిస్తుండడం విశేషం. కథ నచ్చి రకుల్ ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

వెంకటేష్, నయనతార జంటగా
లక్ష్మీ, తులసి చిత్రాల తర్వాత వెంకటేష్, నయనతార జంటగా నటించిన సినిమా బాబు బంగారం. తాజా సమాచారం మేరకు మరోసారి వీరిద్దరూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన నయనతార నటిస్తోంది. నయనతార అయితే బాగుంటుందని డైరెక్టర్ బాబి ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. నాలుగో సారి వెంకటేష్ తో నయనతార నటించబోతోంది.

రూమర్స్ కు చెక్ పడింది
రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా తమిళ, హిందీ సినిమాలే అంగీకరిస్తుండటంతో ఇక టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్టే అని భావించారు . కాని వెంకటేష్, నాగ చైతన్య సినిమా చేయ్యబోతుండడంతో రూమర్స్ కు చెక్ పడింది. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











