సినిమా ఒకటి... ఐటమ్ సాంగ్స్ రెండు
హైదరాబాద్ : సాధారణంగా ఒక సినిమాలో ఒక ఐటం సాంగ్ ని ప్లాన్ చేస్తూంటారు కమర్షియల్ దర్శకులు. అయితే తాజాగా మంచు మనోజ్ చిత్రంలో రెండు ఐటం సాంగ్ లు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఆ రెండు హాట్ హాట్ గా ఉండాలని ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నారు. ఇందులో ఒక పాటకు సన్నిలియోన్, మరోపాటకు శిల్పి శర్మా (గ్రీన్ సిగ్నల్ చిత్రం ఫేమ్) డాన్స్ చేస్తున్నారు.
సన్నీలియోన్ అందచందాలు 'కరెంట్ తీగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నాయి. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అది ఓ ఉపాధ్యాయురాలి పాత్రని సమాచారం. రకుల్ ప్రీత్‌సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు.

ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్‌తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్‌తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్‌డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్‌గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.
సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్‌గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











