త్రివిక్రమ్ పై షాకింగ్ రూమర్స్.. ఈ రెండు నిజమైతే??

ప్రెజెంట్ జెనరేషన్ లో ఇండియన్ సినిమా దగ్గర తెలుగు సినిమా రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇపుడు ఇండియన్ సినిమాకి ఫేస్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నిలిచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి రాజమౌళితో పాటుగా మన తెలుగు సినిమా దగ్గర తన కెరీర్ స్టార్ట్ అయ్యిన నాటి నుంచే ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పుడు వరకు వచ్చిన వారిలో దాదాపు అంతా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నారు.

కాగా జక్కన్న భయపడ్డ ఆ ఇద్దరు దర్శకుల్లో సుకుమార్ ఆల్రెడీ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి రాజమౌళి రికార్డ్స్ బ్రేక్ చేసేసారు. అయితే వీరితో పాటుగా ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న మాటల రచయితా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే కూడా జక్కన్న భయపడ్డారు. కాగా సుకుమార్, ఆల్రెడీ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేశారు కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ లిస్ట్ లో ఇంకా చేరాల్సి ఉంది.

two solid rumors going on director trivikram surrounding here is what

కాగా రీసెంట్ గానే త్రివిక్రమ్ తన చిరకాల స్నేహితుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి. తెలుగు సినిమా బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి కుంభమేళా స్నానాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా వీరితో పాటుగా పవన్ నట వారసుడు కొణిదెల అకీరానందన్ కూడా కనిపించాడు. ఇలా త్రివిక్రమ్ చాలా రోజులు బయటకి వచ్చిన తర్వాత ఓ షాకింగ్ రూమర్స్ రెండు వినిపిస్తున్నాయి.

కాగా ఒక సినిమా రంగానికి చెందింది అయితే మరొకటి పొలిటికల్ గా అని తెలుస్తుంది. కాగా మొదటిగా పొలిటికల్ చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజకీయ అరంగేట్ర చేయనున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు పొలిటికల్ గా దూరంగానే ఉన్నా త్రివిక్రమ్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో దిగాలని అనుకుంటున్నట్టుగా గాసిప్స్ గుప్పుమన్నాయి.

అది కూడా తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనే తాను చేరుతారు అన్నట్టుగా కూడా వినికిడి. ఆల్రెడీ త్రివిక్రమ్ కి పవన్ కి సన్నిహితులు అయినా నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా జనసేన పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. జనసేన కండువా వేసుకొని తాను ప్రచారం కూడా చేశారు. కాగా ఇదే నిర్మాతతో త్రివిక్రమ్ ఎన్నో సినిమాలు కలిసి నిర్మాణం వహించారు.

two solid rumors going on director trivikram surrounding here is what

సో అన్ని గూటి పక్షులు ఇపుడు ఒకే చోటికి చేరనున్నాయి అన్నట్టుగా క్రేజీ రూమర్స్ మొదలయ్యాయి. ఇక మరో సాలిడ్ రూమర్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ ని హీరోగా పరిచయం చేసేది కూడా త్రివిక్రమే అంటూ సినిమా పరంగా టాక్ మొదలైంది.

దర్శకునిగా నాన్నతో వర్క్ చేసి ఇపుడు కొడుకును కూడా తన దర్శకత్వంలోనే పరిచయం చేయనున్నారట. ఇలా రెండు ఊహించని రూమర్స్ అయితే త్రివిక్రమ్ పై ఇపుడు సినీ వర్గాల్లో అటు రాజకీయాల పరంగా కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: trivikram pawan kalyan akira
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X